- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti make distance from these things in time otherwise you will regret later in telugu
Chanakya Niti: జీవితంలో విజయం సొంతం చేసుకోవాలంటే ఈ ఐదింటికి దూరంగా ఉండమంటున్న చాణక్య
Chanakya Niti: జీవితంలో విజయం సొంతం చేసుకోవాలంటే విషయాలకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు హెచ్చరించాడు. అలా చేయడంలో విఫలమైతే భవిష్యత్తులో పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుందని నీతి శాస్త్రంలో చెప్పాడు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం
Updated on: May 06, 2022 | 11:14 AM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో చాలా విషయాలు ప్రస్తావించాడు. ఇందులో కొన్ని విషయాలకు, అలవాట్లకు మనుషులకు దూరంగా ఉండమని చెప్పాడు. లేదంటే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుందని తెలిపాడు

దయలేని మతం - ఆచార్య చాణక్యుడు ప్రకారం.. దయలేని కనికరం లేని అటువంటి మతాన్ని వదులుకోవాలి. దయను బోధించని, ప్రజలకు సహాయం చేయకూడదని బోధించే మతం వలన ఎవరికీ ఉపయోగం లేదు. అటువంటి మతాన్ని వదిలివేయాలి. భక్తి మార్గంలో నడవడంతోపాటు మానవత్వాన్ని బోధించే ధర్మాన్ని అనుసరించమని సూచించాడు.

జ్ఞానం లేని గురువు - ఆచార్య చాణక్యుడు ప్రకారం.. జ్ఞానం లేని గురువు నుండి దూరంగా ఉండాలి. తన మతం, తన కర్తవ్యం గురించి అవగాహన లేని గురువునుంచి దూరంగా ఉండాలి. అటువంటి గురువు దగ్గర ఉండడం వలన మీరు జీవితంలో ఏమీ సాధించలేరు. ఇది జీవితాన్ని మెరుగుపరచడానికి బదులుగా పాడు చేస్తుంది.

చెడు సాంగత్యం - మీరు చెడు అలవాట్లను కలిగి ఉన్న లేదా ఏదైనా చెడు వ్యసనానికి గురైన స్నేహితులతో జీవిస్తున్నట్లయితే, వారి నుండి దూరంగా ఉండండి. చెడు సహవాసం మీ భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపుతుంది.

స్వార్థ బంధువులు - ఆచార్య చాణక్యుడు ప్రకారం, స్వార్థపరుల నుండి దూరం ఉంచండి. చాలా మంది బంధువులు తమ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్లారు. అలాంటి వారినుంచి దూరంగా ఉండండి. అటువంటి స్వార్ధపరులు భవిష్యత్తులో మీకు హాని కలిగించవచ్చు.




