Zodiac Signs: గ్రహాల స్థితిగతుల ప్రభావంతో వారికి ఒక్కసారిగా అదృష్టం పట్టబోతుంది.. మరి మీ రాశికి ఎలా ఉందంటే..?

| Edited By: Janardhan Veluru

Jun 04, 2023 | 9:22 PM

Astrology In Telugu: ప్రస్తుతం మేష రాశిలో గురు, రాహువుల సంచారం జరుగుతోంది. అదేవిధంగా వృషభంలో రవి, బుధులు, కర్కాటకంలో కుజ, శుక్రులు, తులా రాశిలో కేతువు, కుంభరాశిలో శని సంచరిస్తున్నాయి. ఈ గ్రహాల ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.

1 / 13
గ్రహ సంచారం గ్రహాల స్థితిని బట్టి రాశుల వారికి వారి వ్యక్తిగత జీవితాలలో చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులు వారి జీవితాలపై అధిక ప్రభావాన్ని కనబరుస్తూ ఉంటాయి. ప్రస్తుతం మేష రాశిలో గురు, రాహువుల సంచారం జరుగుతోంది. అదేవిధంగా వృషభంలో రవి, బుధులు, కర్కాటకంలో కుజ, శుక్రులు, తులా రాశిలో కేతువు, కుంభరాశిలో శని సంచరిస్తున్నాయి. ఈ గ్రహాల ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.

2 / 13
మేష రాశి: ఈ రాశిలో గురు రాహు గ్రహాల సంచారం వల్ల కొద్దిగా గురు చండాల యోగం ఏర్పడుతోంది.  ఈ మేష రాశిలో గురువు రాహు సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలు అతివేగంగా, అతి చురుకుగా అనుభవానికి వస్తాయి. ఉద్యోగం రావడం, ఉద్యోగంలో ఎదగటం పెళ్లి సంబంధం కుదరటం, ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు త్వరితగతిన సమకూరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఈ రాశిలో గురు గ్రహ సంచారం వల్ల సంతానయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి రెండు శుభకార్యాలు జరగటం, శుభవార్తలు వినటం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి కూడా తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 13
వృషభ రాశి: ఈ రాశి వారికి నెల రోజుల కాలంలోనే అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఈ రాశిలో బుధ, రవుల సంచారం ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ సమస్యలకు కూడా పరిష్కారాన్ని ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంటుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వినటం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కూడా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తుంది. వీసా సమస్యలు తొలగిపోయే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు రెండు మూడు ఆఫర్లు అందడం జరుగుతుంది.

4 / 13
మిథున రాశి: ఈ రాశిలో ప్రస్తుతానికి గ్రహ సంచారం ఏదీ జరగనప్పటికీ ఈ రాశి నాథుడైన బుధుడు వృషభంలో రవితో కలిసి సంచరిస్తున్నందువల్ల ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తప్పకుండా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఎవరికైనా హామీలు ఉండి దెబ్బ తినడం, అనారోగ్యం, ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడడం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయపరంగా కొత్త ప్రయత్నాలు సఫలం కావచ్చు. మీ దగ్గర డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది.

5 / 13
కర్కాటక రాశి: ఈ రాశిలో కూడా గ్రహ సంచారం ఏదీ జరగన ప్పటికీ, ఈ రాశి వారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉద్యోగంలోనూ వృత్తి వ్యాపారాలలోనూ ముందడుగు వేయటానికి మార్గం సుగమం అవుతుంది. ఈ రాశి నాధుడైన చంద్రుడి సంచారాన్ని బట్టి ఈ రాశి వారి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఈ రాశి వారికి ఎవరి నుంచీ సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ ఆర్థికంగా పురోగతి సాధించడానికి, అదనపు ఆదాయ మార్గాలు సఫలం కావడానికి అవకాశం ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించే పక్షంలో అటు ఉద్యోగ జీవితం ఇటు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది.

6 / 13
 సింహ రాశి: ఈ రాశిలో గ్రహాలు ఏవి లేనప్పటికీ గురు శని గ్రహాల దృష్టి ఈ రాశి మీద పడినందువల్ల, కొద్దిపాటి అదృష్టం పట్టడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాకుండా ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం  చాలావరకు కుదుటపడుతుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోయి ప్రశాంత వాతావరణ ఏర్పడుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ యానానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు.

7 / 13
కన్యా రాశి: ఈ రాశిలో కూడా గ్రహసంచారమేమి జరగటం లేదు. అయితే ఈ రాశి నాథుడైన బుధుడు త్వరలో వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం లేదా ధనయోగం పట్టే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు అను కోకుండా పరిష్కారం కావడం, కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వినటం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. నిరుద్యోగు లకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

8 / 13
తులా రాశి: ఈ రాశిలో ప్రస్తుతం కేతు సంచారం జరుగుతున్నందువల్ల ప్రజాకర్షణ పెరుగుతుంది. అటు ఉద్యోగంలోనూ ఇటు సామాజికంగానూ ప్రతి వారు ఈ రాశి వారిని మెచ్చుకోవడం జరుగు తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారి తీసే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో డిమాండ్ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంటుంది. దూర ప్రయాణాలకు విహార యాత్రలకు అవకాశం ఉంది.

9 / 13
వృశ్చిక రాశి: ఈ రాశిలో చంద్ర సంచారం మాత్రమే జరుగు తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థికంగా శక్తి పుంజుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి కొద్దిగా సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వినవచ్చు. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రయాణాలలో డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది.

10 / 13
ధనూ రాశి:ఈ రాశిలో ప్రస్తుతానికి గ్రహాలు ఏవీ లేనప్పటికీ ఈ రాశి మీద గురు దృష్టి ఉన్నందువల్ల ఆర్థికంగా, ఉద్యోగ పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది తప్పకుండా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అనేక విధాలుగా డబ్బు కలిసి రావటం అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం, డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇవ్వటం వంటి శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి. సంతానం అభివృద్ధి చెందు తుంది. సంతానంలో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడటం జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి తీపి సమాచారం అందు తుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది.

11 / 13
మకర రాశి: ఈ రాశిలో కూడా ప్రస్తుతానికి గ్రహలేవీ లేనప్పటికీ, కుజ, శుక్ర గ్రహాల దృష్టి ఉన్నందువల్ల ఉద్యోగ పరంగా సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడే అవకాశం ఉంది. బంధు వర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ పరంగా సుఖ సంతోషాలతో గడపటం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావచ్చు. అయితే కొందరు సన్నిహితులు నమ్మించి మోసగించే అవకాశం ఉంది.

12 / 13
కుంభ రాశి: ఈ రాశిలో శని సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారు కొద్దిగా ఆలస్యంగా అయినప్పటికీ వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరమైన, శాశ్వతమైన పురోగతి సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిపాటి ప్రయత్నంతో ఆశించిన దాని కంటే ఎక్కువగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ మాటకు మీ చేతకు విలువ పెరుగుతుంది. విదేశాలలో కానీ దూర ప్రాంతంలో గానీ మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధు వర్గంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట ఇనుమడిస్తుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అనేక ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

13 / 13
మీన రాశి: ఈ రాశిలో గ్రహ సంచారం జరగనప్పటికీ, ఆర్థికంగా కొద్దిగా బలపడటం జరుగుతుంది. ఈ రాశి నాథుడైన గురుగ్రహం ధనస్థానంలో సంచరిస్తున్నందువల్ల ఏలినాటి శని ప్రభావం కూడా బాగా తగ్గిపోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. శుభకార్యాలు లేదా పుణ్య కార్యాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అది తప్పకుండా సఫలం కావచ్చు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.