
చాలా పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శివుని పూజలు చేస్తూ శివారాధన చేస్తుంటారు. 2025వ సంవత్సరంలో అక్టోబర్ 21 నుంచి కార్తీక మాసం మొదలై, నవంబర్ 20న ముగుస్తుంది.

అయితే ఈ సమయంలో చాలా మంది తీర్థయాత్రలు చేయడం, శివాలయాలు దర్శించి ప్రత్యేక పూజలు చేయడం, చేస్తుంటారు. అయితే ఈ మాసంలో కొన్ని రాశుల వారు పూజలు చేయకున్నా వారిపై ఆ పరమేశ్వరుడు, తన అనుగ్రహాన్ని అందించనున్నాడంట. దీంతో వారికి పట్టిందల్లా బంగారమే కానున్నది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ కార్తీక మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థి చాలా బాగుటుంది. అంతే కాకుండా వీరికి వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. కుటుంబంలోని సమస్యలు తొలిగిపోయి చాలా సంతోషంగా ఉంటారు.

తుల రాశి : ఈ రాశి వారికి ఈ మాసంలో రాజ్యపూజ్యం అధికంగా ఉంటుంది. అంతే కాకుండా, వీరు కుటుంబ సభ్యులతో శివాలయాలు దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే ఈ రాశి వారు కొత్త ఉద్యోగంలో చేరి, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.

మకర రాశి : ఈ మాసం మొత్తం వీరికి అత్యద్భుతంగా ఉండబోతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో వీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడం ఖాయం.