
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది వాస్తు బాగుండాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఇంటిని అదంగా అలంకరించుకుంటారు. దీని కోసం ఎక్కువగా, ప్లాస్టిక్ మొక్కలు, పూలు పెడుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ప్లాస్టిక్ మొక్కలు ఉండటం శ్రేయస్కరం కాదంట, ఇది పలు రకాల సమస్యలకు కారణం అవుతుందంట.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ప్లాస్టిక్ పువ్వులు, మొక్కలు ఉండటం శుభప్రదం కాదంట, ఎందుకంటే వీటికి జీవం ఉండదు కాబట్టి ఇవి ఇంటిలో ఉండటం వలన ఇంటిలోనికి నిర్జీవ శక్తిని ఆకర్షిస్తాయంట. అంతే కాకుండా వీటివలన ఇంటిలోపల ప్రతికూల శక్తి పెరిగిపోతుందంట. అలాగే వీటిపైన మట్టి, దుమ్మ, ధూలి పేరుకపోయి అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందంట.

ఇక ఇంటిలో చాలా మంది ఎక్కువ కృత్రిమ మొక్కలనే పెడుతుంటారు. కానీ ఇవి నెగటీవ్ శక్తిని ప్రేరేపిస్తాయంట. కుటుంబ వాతావరణాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎవరి ఇంటిలోనైతే కృత్రిమ పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయో, వారి ఇంట ఎప్పుడూ కలహాలు , ఉద్రిక్తత వాతావరణం విభేదాలే ఉంటాయంట.

కృత్రిమ మొక్కలు ఇంటి స్వేఛ్చను హరించేస్తాయంట. ఇంటిలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తాయంట. అంతేకాకుండా ఇంటిలో వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంట, ఇవి సోమరితనాన్ని ప్రేరేపిస్తాయంట. అందుకే వీలైనంత వరకు ఇంటిలోపల కృత్రిమ పూల మొక్కలు పెట్టుకోకపోవడం మంచిదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

నిజమైన పువ్వుల మొక్కలు ఇంటిలో సానుకూలతను పెంచుతాయి. అంతే కాకుండ వాతావరణాన్ని శుద్ధి చేసి, ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అందుకే ఇంటిలో ప్లాస్టిక్ పూల మొక్కల కంటే, నిజమైన పూల మొక్కలు ఉండటం మంచిదని చెబుతున్నారు వాస్తు శాస్తర నిపుణులు.