
వృషభం: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడితో పాటు గురువు, బుధుడు, శనీశ్వరుడు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల ఫిబ్రవరి నుంచి సునాయాస ధన సంపాదన యోగం పడుతోంది. దాదాపు నవంబర్ వరకూ కొనసాగే ఈ యోగం వల్ల వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో సంబంధం లేకుండానే వీరు అత్యధికంగా సంపాదించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు వీరికి అపారంగా లాభించడం జరుగుతుంది.

కర్కాటకం: మార్చి మొదటి వారం నుంచి ఈ రాశివారికి అనేక విధాలైన ధన యోగాలు పట్టబోతున్నాయి. ముఖ్యంగా ఒకటికి రెండుసార్లు ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి సంపాదించే అవకాశం కూడా ఉంది. ఆస్తిపాస్తుల మీద వచ్చే ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.

కన్య: ఈ రాశివారికి ఈ ఏడాది షేర్లు, స్టాక్ మార్కెట్ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రాశ్యధిపతి బుధుడితో పాటు ధనాధిపతి శుక్రుడు, ధన కార కుడు గురువు కూడా ఈ ఏడాది ఉచ్ఛపడుతున్నందువల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం విజయం సిద్ధిస్తుంది. లాటరీ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు, వడ్డీ వ్యాపారాలు బాగా లాభిస్తాయి. స్థలాలు, పొలాల మీద వచ్చే ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

తుల: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడితో పాటు గురువు, వ్యాపార కారకుడైన బుధుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారు మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది. వీరికి షేర్లు, ఆర్థిక లావాదేవీలు, జూదాలు, బెట్టింగులు కూడా బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తుల ద్వారా లభించే ఆదాయం బాగా పెరుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది.

ధనుస్సు: ఈ రాశివారికి ఫిబ్రవరి నుంచి అదనపు ఆదాయం అనేక రెట్లు వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, మదుపులు బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తులపై వచ్చే ఆదాయం, అద్దెలపై వచ్చే ఆదాయం బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. రావలసిన సొమ్ముతో పాటు రాదనుకున్న డబ్బుకూడా పూర్తిగా వసూలవుతాయి.

మీనం: ఈ రాశివారికి వ్యవసాయం ద్వారా, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లభించే ఆదాయం బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తిపాస్తులు, వారసత్వపు సంపద, పిత్రార్జితం లభిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలితాలనిస్తాయి. లాటరీల ద్వారా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి కూడా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.