
కావాల్సిన పదార్ధాలు : ఒక కట్ట పాలకూర, 2 కప్పులు బియ్యపు పిండి, ఐదు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంతా ఉప్పు, నూనెను వేసుకోవాలి

పాలకూర పేస్ట్: ముందుగా పాలకూరను తీసుకుని నీటితో రెండు మూడు సార్లు కడిగి, ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లాన్ని మిక్సీ జార్‌లో వేసి, నీటిని పోసి మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి.

పిండి కలుపుకోవడం: ఈ పాలకూర పేస్ట్ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న దోస పిండిలో వీటిని వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ఇంకా చెప్పాలంటే అవసరమైతే దానిలో ఒక గ్లాస్ నీరు, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి దోస పిండి లాగా దీనిని కలిపి రెడీ చేసుకోవాలి.

దోస వేయడం: ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి, దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి, అది వేడయ్యాక ఒక గరిటె పిండిని దాని వేసి దోసలాగా వేసుకోవాలి.

మరి హై మీద కాకుండా మీడియం మంట మీద దానిని ఉంచి దోసను రెండు వైపులా రంగు మారే వరకు కాల్చుకోవాలి. అలా కాల్చిన పాలకూర అట్టును ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతే, వేడి వేడి పాలకూర అట్టు రెడీ.