Hyderabad: వీకెండ్‌లో బయటకి వెళ్లాలని ప్లాన్‌ చేశారా? ఈ MMTS రైళ్లు రద్దయ్యాయి చూసుకోండి..

|

Jul 20, 2024 | 3:32 PM

ఆర్టీసీ బస్సుల తర్వాత హైదరాబాదీలు ఎక్కువగా ఉపయోగించే రవాణా సాధనం ఎంఎంటీఎస్. తక్కువ ఛార్జీతో, ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండడంతో చాలా మంది వీటి సేవలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్స్‌కి సమీపంలో కాలేజీలు ఉన్న విద్యార్థులు, ఆఫీసులు ఉన్న ఉద్యోగులు వీటినే ఉపయోగించుకుంటున్నారు. అయితే తాజాగా అధికారులు కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు..

1 / 5
ఎంఎంటీఎస్‌ రైళ్లను వారాంతాల్లో ఉపయోగించే వారు కూడా ఎక్కువగా ఉంటారు. అలాంటి వారి కోసమే దక్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శనివారం, ఆదివారం రెండు రోజుల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

2 / 5
సోమవారం ఉదయం నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లు తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయం మార్గాలను వెతుక్కోవాలని సూచించారు. ఏయే రైలు సర్వీసులు రద్దయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
రామచంద్రపురం-ఫలక్‌నుమా మధ్య ప్రయాణించే 47177 నెంబర్‌ రైలు, ఫ‌ల‌క్‌నుమా, సికింద్రాబాద్‌ల మధ్య నడిచే 47156 నెంబర్‌ ట్రైన్‌, సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా మధ్య నడిచే 47185 రైలును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

4 / 5
వీటితో పాటు ఫలక్‌నుమా-సికింద్రాబాద్ మధ్య ప్రయణించే 47252 నెంబర్‌ రైలు, సికింద్రాబాద్ మేడ్చల్‌ మధ్య నడిచే 47243 నెంబర్‌ ట్రైన్‌ అలాగే.. మేడ్చల్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే 47241 నెంబర్ రైళ్లు రద్దయ్యాయి.

5 / 5
ఇక సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా మధ్య నడిచే 47250 నెంబర్‌ రైలు, ఫ‌ల‌క్‌నుమా – హైద‌రాబాద్ మధ్య నడిచే 47201 నెంబర్‌ రైలు, హైద‌రాబాద్ – లింగంప‌ల్లి మధ్య నడిచే 47119 నెంబర్‌ రైలు, లింగంప‌ల్లి – ఫ‌ల‌క్‌నుమా మధ్య నడిచే 47217 నెంబర్‌ రైలు, ఫ‌లక్‌నుమా – రామ‌చంద్ర‌పురం మధ్య నడిచే 47218 నెంబర్‌ రైలు రద్దు అయినట్లు ప్రకటించారు.