- Telugu News Photo Gallery Snake Gourd: Fantastic Health Benefits Of Adding Snake Gourd Seeds To Daily Diet
Snake Gourd Seeds: ఈ కూరగాయ విత్తనాలను లైట్ తీసుకోకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రాలు!
కూరగాయలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలు. శరీర పనితీరును మెరుగుపరచడానికి, వ్యాధులను నివారించడానికి సహాయపడే వందలాది పోషకాలు వీటిల్లో పుష్కలంగా ఉంటాయి. పొట్లకాయ కూడా అలాంటి ఒక కూరగాయ. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది..
Updated on: Mar 14, 2025 | 9:19 PM

కూరగాయలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలు. శరీర పనితీరును మెరుగుపరచడానికి, వ్యాధులను నివారించడానికి సహాయపడే వందలాది పోషకాలు వీటిల్లో పుష్కలంగా ఉంటాయి. పొట్లకాయ కూడా అలాంటి ఒక కూరగాయ. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

పొట్లకాయలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు నిండుగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు నివారణ అవుతాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఇది బలేగా పని చేస్తుంది. జ్వరం, కామెర్లు ఉన్నవారు పొట్లకాయ గింజలను వేయించి తింటే త్వరగా కోలుకుంటారు.

ఈ విత్తనాలు గుండె జబ్బులు ఉన్నవారికి చాలా మంచివి. ఇవి గుండెపోటును నివారించడానికి సహాయపడతాయి. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల దీని వినియోగం ఎముకలను బలపరుస్తుంది. జ్వరం ఉన్నవారు ఈ విత్తనాలను తింటే జ్వరం త్వరగా తగ్గిపోతుంది.

ఛాతీ నొప్పి, అధిక రక్తపోటు, ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు రోజుకు 30 మి.లీ. పొట్లకాయ రసం తాగాలి. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

జుట్టుకు పోషణ అందించడానికి చాలా ముఖ్యమైన పోషకాలు పొట్లకాయ గింజల్లో ఉన్నాయి. వీటిని పేస్ట్‌లా తయారు చేసి, హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రు, ఇతర జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. ఇది నిద్రలేమి సమస్యను కూడా తొలగిస్తుంది.





























