
కొందరు కావాలని ఒకేసారి స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తారు. అయితే, ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. మీరు సరదాకి తాగితే.. ఆ తర్వాత హాస్పిటల్ బిల్ పేలి పోద్ది. అసలు ఇలా తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చూద్దాం..

ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, గుండె జబ్బులు ఉన్నవారు ఇలా తీసుకోకండి లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

జీర్ణ వ్యవస్థ: మద్యపానం, ధూమపానం కలిపి చేయడం వలన శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఆ సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఇంకా అదే సమయంలో ధూమపానం కూడా చేస్తే శ్వాసకోశ సమస్యలు వస్తాయి

లివర్ ఆరోగ్యం: ధూమపానం లంగ్స్ ను దెబ్బతీస్తుందని అందరికీ తెలుసు. అలాగే, డ్రింకింగ్ లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇవి రెండు ఒకేసారి చేసినప్పుడు శరీరంలో అవయవాలన్ని పని చేయకుండా పోతాయి. కాబట్టి, ఈ రెంటింటిని కలిపి ఒకేసారి చేయకండి.

గర్భిణీలు: గర్భిణీ స్త్రీలు కూడా మద్యపానం, ధూమపానం కలిపి చేయకండి. ఎందుకంటే, శిశువువు ప్రమాదం. ఈ అలవాటు శిశువు అభివృద్ది సరిగ్గా జరగనివ్వదు. కాబట్టి ఇలా చేయకండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)