Sleeping Tips: పడుకోగానే కమ్మటి నిద్ర పట్టాలంటే.. గోరు వెచ్చని పాలల్లో చిటికెడు..

|

Oct 08, 2023 | 8:01 PM

రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోతే రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది. మత్తుగా అనిపిస్తుంది. చాలా మందికి రాత్రి పడుకున్న తర్వాత సరిగ్గా నిద్రపట్టక అవస్థపడుతుంటారు. మీరూ ఈ సమస్యతో బాధపుడుతుంటే భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి.. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే అనేక వ్యాధులు దాడిచేస్తాయి. మధుమేహం, రక్తపోటు, డిప్రెషన్ వంటి అనేక సమస్యలు చుట్టుముడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 7-8 గంటల నిద్ర అవసరం అని చెబుతున్నారు..

1 / 5
రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోతే రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది. మత్తుగా అనిపిస్తుంది. చాలా మందికి రాత్రి పడుకున్న తర్వాత సరిగ్గా నిద్రపట్టక అవస్థపడుతుంటారు. మీరూ ఈ సమస్యతో బాధపుడుతుంటే భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి.. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే అనేక వ్యాధులు దాడిచేస్తాయి. మధుమేహం, రక్తపోటు, డిప్రెషన్ వంటి అనేక సమస్యలు చుట్టుముడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం..  ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 7-8 గంటల నిద్ర అవసరం అని చెబుతున్నారు.

2 / 5
రాత్రిపూట నిద్రపోకపోవడం, తరచుగా మేల్కొలపడం, 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నవారి నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు ఈ 5 రకాల పానీయాలలో ఏదైనా ఒకటి సేవిస్తే సరి. కమ్మటి నిద్ర మీ కళ్ల వద్ద వేచి ఉంటుంది. అశ్వగంధను ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. రాత్రి పడుకునే ముందు అశ్వగంధ టీ తాగతే.. నాడీ వ్యవస్థను శాంతపరిచి.. విశ్రాంతి అనుభవాన్ని కలిగి ఉంటుంది. ఈ పానీయం ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 1/2 టీస్పూన్ అశ్వగంధ పొడిని గోరువెచ్చని నీటిలో కలుసుకుని తాగితే నిద్ర పడుతుంది.

3 / 5
అలాగే నెయ్యి కూడా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగాలి. ఇది మెదడును శాంతపరచి నిద్ర సమస్యలను దూరం చేస్తుంది. కుంకుమపువ్వు, యాలకులు కలిపిన పాలను కూడా తాగొచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. ఈ పానీయం ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు వేడి పాలల్లో చిటికెడు కుంకుమపువ్వు, యాలకుల పొడి కలుపుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది.

4 / 5
రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలలో పసుపు పొడిని కలిపి తాగినా  పలితం ఉంటుంది. పసుపు కలిపిన పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని కర్కుమిన్ సమ్మేళనం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. వేడి పాలలో పసుపు, జాజికాయ పొడి కలిపి తాగవచ్చు. వేడి పాలలో చిటికెడు పసుపు, జాజికాయ పొడి కలుపుకుని తాగితే ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యను తగ్గించి, విశ్రాంతి భావనను కలిగిస్తుంది.

5 / 5
నిద్ర సమస్యలకు చమోమిలే టీ కూడా ఉపయోగపడుతుంది. చమోమిలే టీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కనురెప్పలలో నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.