
వాస్తవానికి శరీరానికి ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే చికిత్సను తీసుకుంటాం.. అయితే మనస్సుకు సంబంధించిన అనారోగ్యాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోము. డిప్రెషన్ బారిన పడిన వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకనే శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కనుక డిప్రెసెన్ ను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం మానవ జీవన విధానం ఉరుకుల పరుగుల మయం.. పని ఒత్తిడితో మానసికంగా ఇబ్బంది పడుతున్నవారు సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. దీంతో సైకియాట్రిక్ వైద్యుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది.

అయితే మీరు డిప్రెషన్‌లో ఉన్నట్లు మీకు ఎలా తెలుస్తుంది? మానసికంగా ఇబ్బంది పడుతున్నారని తెలియడానికి కొన్ని ప్రాధమిక లక్షణాలున్నాయి. మొదట్లోనే వాటిని గుర్తిస్తే.. మంచింది. అయితే మానసిక అనారోగ్యంలో వివిధ స్థాయిలు ఉన్నాయి.

ప్రధానంగా మూడవ స్థాయి తర్వాత మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. అయితే అప్పటి వరకు మీరు డిప్రెషన్‌లో ఉన్నారో లేదో మీరే అర్థం చేసుకోవచ్చు.

ఆహారపు అలవాట్లలో మార్పు మానసిక అనారోగ్యానికి ప్రధాన లక్షణం. మీరు క్రమంగా తినాలనే కోరికను కోల్పోతారు. ఎంతగా అంటే మీరు సమయానికి తినడానికి కూడా పెద్దగా ఇష్టపడరు.

పని విషయంపై కూడా పెద్దగా ఆసక్తి ఉండదు. ఇలా చాలా కాలం పాటు జరిగితే, మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని మీరు అర్థం చేసుకోవాల్సిందే. అంతేకాదు రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు. లేదా రోజంతా నిద్రపోకుండా అలాగే ఉంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాల్సిందే.

జీవితంలో ఏ దిక్కు లేదు.. జీవితంచానికి ప్రేరణ ఎక్కడా కలగడం లేదు అని ఫీలింగ్ కలిగితే.. పని చేసేందుకు శక్తి, ఆశక్తి ఉండదు. ఈ లక్షణాలు కనిపిస్తే అవి ఖచ్చితంగా డిప్రెషన్‌కు సంకేతం.

పని పట్ల శ్రద్ధ కలగకపోతే జాగ్రత్తగా ఉండండి. ఏ పనిపైనా ఎక్కువ కాలం దృష్టి పెట్టలేరు. ఏదైనా పుస్తకాలు చదవాలనే కోరిక లేకపోయినా.. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే.. వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.