Health Lips: లిప్‌స్టిక్‌‌తో ఆందమే కాదు అనారోగ్యం కూడా.. శరీరంపై చూపే దుష్ప్రభావాలేమిటో తెలిస్తే తక్షణమే వదిలేస్తారు..

Updated on: Sep 22, 2023 | 7:36 AM

Health Lips: అందంగా కనిపించాలని ఎవరు మాత్రం ఇష్టపడరు..! అందరిలో తాము ఆకర్షణీయంగా కనిపించాలని కొందరు మగువలు మార్కెట్‌లో లభించే అన్ని రకాల ప్రోడక్ట్స్ వాడుతుంటారు. వీటిల్లో లిప్‌స్టిక్ కూడా ఒకటి. అయితే లిప్‌స్టిక్‌ తయారీలో రసాయనాలు ఉపయోగిస్తారని, అవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయని తెలుసా..? లిప్‌స్టిక్ వాడడం వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది.

1 / 5
Health Lips: ఆకర్షణీయంగా కనిపించాలని మగువలు ఉపయోగించే కాస్మటిక్స్‌లో లిప్‌స్టిక్ కూడా ఒకటి. అయితే నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్‌లోని ఓ అధ్యయనం ప్రకారం, లిప్‌స్టిక్‌లో రంగును తయారు చేయడానికి మాంగనీస్, సీసం, కాడ్మియం వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి ఉన్న లిప్‌స్టిక్ వాడటం వల్ల శరీరంలో అలర్జీ వస్తుంది.

2 / 5
మరో పరిశోధన ప్రకారం, పెదవులకు అప్లై చేసే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో చాలా కెమికల్స్ ఉపయోగిస్తారు. ఈ రసాయనాలతో కూడిన లిప్‌స్టిక్‌ని పెదవులపై అప్లై చేస్తే నోటి ద్వారా పొట్టలోకి చేరి, కడుపుకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది.

3 / 5
అలాగే లిప్‌స్టిక్ తయారీలో ఉపయోగించే సీసం గర్భధారణకు కూడా ప్రమాదకరం. ఇది గర్భిణీ స్త్రీ, ఆమె పిండానికి హాని కలిగిస్తుంది. లిప్‌స్టిక్ పెదవుల ద్వారా కడుపులోకి చేరి రక్తంలోని సీసం స్థాయిని పెంచుతుంది.

4 / 5
లిప్‌స్టిక్‌లోని కెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. లిప్‌స్టిక్‌లో కలిపే పెట్రో కెమికల్ వల్ల తెలివితేటలు, పునరుత్పత్తి వ్యవస్థ, శారీర ఎదుగుదలపై చెడు ప్రభావం పడుతుంది

5 / 5
కాబట్టి లిఫ్టిక్‌ను డైరెక్ట్‌గా పెదవులపై వేసుకోకుండా, అంతకు ముందుగానే పెదవులకు కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలి. ఆ తరువాతే లిఫ్టిక్ పూసుకోవాలి. కొబ్బరి నూనె పెదవులకు నష్టం కలగకుండా రక్షణ కవచంలా సహాయపడుతుంది.