
వ్యాక్సింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మంపై టాన్‌ను తొలగిస్తుంది. చర్మాన్ని అందంగా చేస్తుంది. అయితే ఈ వాక్సింగ్ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవును.. వ్యాక్సింగ్ చర్మాన్ని అందంగా మార్చడమే కాదు చర్మ అందవిహీణంగా కూడా చేస్తుంది. తరచూ వ్యాక్సింగ్ చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. దీర్ఘకాలం పాటు నిరంతర వ్యాక్సింగ్ చేయడం వల్ల చర్మం స్థితిస్థాపకత దెబ్బతింటుంది.

అధికసార్లు వ్యాక్సింగ్ చేస్తే చర్మంపై ముడతలు ఏర్పడతాయి. చర్మం సాగినట్లు కనిపిస్తుంది. వ్యాక్సింగ్ చేసిన ప్రతిసారీ ఇలా జరుగుతుంది. ఫలితంగా చర్మంపై ముడతలు ఏర్పడి చర్మ సౌందర్యం దెబ్బతింటుంది.

చర్మంపై అవాంచనీయ వెంట్రుకలను తొలగించడానికి వ్యాక్సింగ్ చేస్తే చర్మంపై దాని ప్రతిచర్యలు ఏర్పడతాయి. ఎక్కువసేపు వ్యాక్సింగ్ చేసినా చర్మం రంగు మారుతుంది. పదేపదే చర్మం సాగదీయడం వల్ల చర్మం రంగు కూడా మారుతుంది.

దీని ప్రభావం అండర్ ఆర్మ్స్ లో ఎక్కువగా ఉంటుంది. మిగిలిన చర్మం కంటే అండర్ ఆర్మ్స్ చర్మం ముదురు రంగులో ఉంటుంది. ఇలా చాలా మందికి ఉంటుంది. దీనికి కారణం రెగ్యులర్ వ్యాక్సింగ్.

రెగ్యులర్ వ్యాక్సింగ్ వల్ల చర్మంలోని కొన్ని భాగాలు నల్లగా మారుతాయి. వ్యాక్సింగ్ తర్వాత చాలా మందికి హెయిర్ ఫోలికల్స్ నుండి రక్తస్రావం జరుగుతుంది. ఫలితంగా చర్మంపై రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.