
కాబట్టి అల్లంతో తయారు చేసిన టీతో రోజు ప్రారంభిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం ముక్క తిన్నా లాభం ఉంటుందట.

అల్లం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గుండె సమస్యలు, అజీర్ణం, విరేచనాలు కూడా కావచ్చు. గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. బ్లడ్ ప్రెషర్ మందులను క్రమం తప్పకుండా తీసుకునే వారు రక్తపోటు అకస్మాత్తుగా తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు.

రోజులో నాలుగు గ్రాముల కంటే ఎక్కువ అల్లం తినకపోవడమే మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట, ఉబ్బరం, వాంతులు, కడుపులో అసౌకర్యం కలుగుతాయి. అన్ని మూలికా పదార్థాలు అందరి శరీరంలో ఒకేలా పని చేయవు.

ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్య కరమైన అలవాట్లు అలవరచుకోవాలి. ఫలితంగా ఎలాంటి వ్యాధి శరీరంలో గూడు కట్టుకోకుండా నివారించవచ్చు. అందుకు ఖరీదైన ఆహారాలు తీసుకోవల్సిన అవసరం లేదు. వంటిట్లో ఉండే అల్లంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

అల్లం రక్తపోటును తగ్గిస్తుంది. అల్లం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను కలిగిస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు అల్లం తినకుండా ఉండటం మంచిది. అల్లం ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం ఎక్కువగా పడుతుందని అంటారు. సుదీర్ఘ కాలంగా షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఎక్కువగా అల్లం తినకూడదు.