- Telugu News Photo Gallery Severe shortage of water in Karnataka, Citizens are in dire straits for drinking water
Water Scarcity: ఖాళీ బిందెలతో కన్నీరు.. గుక్కెడు నీళ్ల కోసం గుప్పెడు ఆశలతో.. ఈ పరిస్థితి ఎక్కడో కాదు..
దేశంలో చాలా చోట్ల నీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు ప్రజలు. అయితే చాపకింద నీరులా ఈ నీటి ఎద్దడి సమస్య పక్క రాష్ట్రమైన కర్ణాటకకు కూడా పాకింది. చెరువులు, ప్రాజెక్టులు, డ్యాంలు, నదులు అన్నీ ఇంకిపోయాయి. వేసవి ప్రారంభమై పట్టుమని 20 రోజుల కూడా కాలేదు. అప్పుడే తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే వర్షాధార పరిస్థితులు తక్కువగా ఉండటంతో నీటి కొరత ఏర్పడింది.
Updated on: Mar 11, 2024 | 2:36 PM

దేశంలో చాలా చోట్ల నీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు ప్రజలు. అయితే చాపకింద నీరులా ఈ నీటి ఎద్దడి సమస్య పక్క రాష్ట్రమైన కర్ణాటకకు కూడా పాకింది.

చెరువులు, ప్రాజెక్టులు, డ్యాంలు, నదులు అన్నీ ఇంకిపోయాయి. వేసవి ప్రారంభమై పట్టుమని 20 రోజుల కూడా కాలేదు. అప్పుడే తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే వర్షాధార పరిస్థితులు తక్కువగా ఉండటంతో నీటి కొరత ఏర్పడింది.

అటు సాగుకు, ఇటు తాగుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు స్థానికులు. కర్ణాటక రాష్ట్రంలోని 70శాతం ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దాదాపు 247 పట్టణాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 645 గ్రామాలకు తాగు నీటిని ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈశాన్య రుతుపవనాల సమయంలో కేవలం 96 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుపుతున్నారు అధికారులు.

నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. బిందెలు, బకెట్లు, వాటర్ క్యాన్లు పట్టుకొని కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడి నీటిని పట్టుకుంటున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర ప్రజలు.




