- Telugu News Photo Gallery Science photos Why apples are reddish is temperature reduce the apple red color
Red Apple: ఎర్రని యాపిల్ కు అంత రంగు ఎలా వస్తుందో తెలుసా? వేడి ఎక్కువైతే యాపిల్ పండు రంగు పోతుందా?
Red Apple: అందరికీ యాపిల్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఎర్రని యాపిల్ అంటే మరీ ఇష్టం. వాతావరణంలో పెరిగిపోతున్న వేడికారణంగా ఎర్రని యాపిల్ రంగుమారుతూ వస్తోందట.
Updated on: Jun 29, 2021 | 12:53 PM

ఎవరన్నా ఎర్రగా ఉన్నారంటే యాపిల్ పండుతో పోలుస్తారు. అంటే యాపిల్ పండు ఆ చక్కనైన రంగుకు ప్రతీక. యాపిల్ పండ్లు ఎరుపు రంగులోనే కాకుండా ఇతర రంగుల్లో కూడా లభిస్తాయి. కానీ, సాధారాణంగా యాపిల్ అంటే రెడ్ యాపిల్ అంతే. దానిని ఇష్టపడినట్టు మరి ఏరంగు యాపిల్ ను ఇష్టపడం. వాతావరణంలో వేడి పెరిగిపోతున్న కారణంగా యాపిల్ పండ్లు తమ ఎరుపు రంగును క్రమేపీ కోల్పోతున్నాయి.

యాపిల్ పండుకు ఆ ఎర్రటి ఎరుపు రంగు రావడానికి కారణం ఏమిటో తెలుసా? దాని తోలులోని నిర్దిష్ట జన్యువుల వ్యక్తీకరణ స్థాయిని బట్టి యాపిల్ కు ఎరుపు రంగు వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎంజైముల జతలు కలిసి పనిచేస్తూ.. యాపిల్ తోలులోని నిర్దిష్ట కణాలను ఆంథోసియానిన్లు అని పిలిచే పిగ్మెంట్లుగా మారుస్తాయని వారు వివరిస్తారు. ఊదా రంగు చిలగడదుంపలకు, ద్రాక్షపండ్లకు, రేగుపండ్లకు వాటి రంగును ఇచ్చేది కూడా ఇవే రకం ఆంథోసియానిన్లు.

ఈ ఎంజైముల స్థాయిలను ఎంవైబీ10 అనే ప్రతిలేఖన మూలకం నియంత్రిస్తుంది. ఒక జన్యువు ఎంతగా వ్యక్తీకృతమవుతుంది అనే దానిని ఈ ఎంవైబీ10 ప్రొటీన్ పర్యవేక్షిస్తుంటుంది. సాధారణంగా ఈ ఎంవైబీ10 ఎంత ఎక్కువగా ఉంటే.. పండు తోలు అంత ఎర్రగా ఉంటుంది. నిజానికి.. ఎరుపు చారలు గల ఆపిల్స్‌లో తోలు మీద ఎర్రటి చారలు ఉన్న ప్రాంతాల్లో ఎంవైబీ10 స్థాయిలు అధికంగా ఉన్నాయని ఒక అధ్యయనంలో గుర్తించారు.

ఎర్రటి ఆపిల్ పండు అంటే అందరికీ ఎంతో కాలంగా చాలా ఇష్టం. కానీ.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఎర్రని ఆపిల్ అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఎందుకంటే, ఈ రంగు ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం ఎరుపు రంగులో ఉండే ఆపిల్ కావాలంటే ఉష్ణోగ్రతలు చల్లగానే ఉండాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒకవేళ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి ఉష్ణోగ్రతలు పెరిగితే ఎంవైబీ10, ఆంథోసియానిన్ స్థాయిలు పడిపోతాయని వారు వివరిస్తున్నారు.

ఎక్కువ ఎరుపు రంగులో ఉండే ఆపిల్స్.. పసుపు రంగు ఆపిల్స్ కన్నా రుచిగా ఉండకపోవచ్చు. నిజానికి వాటికన్నా దారుణంగా కూడా ఉండొచ్చు - కానీ.. 'ఎరుపు రంగు యాపిల్ కే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ' అందుకే ఇప్పుడు శాస్త్రవెత్తలు వేడిలో కూడా యాపిల్ పండ్లు రంగు కోల్పోకుండా ఉండేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.



