- Telugu News Photo Gallery Science photos The square type object on moon China rovar sent a mestirious object photo
Moon Mission: చందమామకు ఆవలివైపు కనిపించిన వింత వస్తువు.. ఏమై ఉండవచ్చు?
చందమామ విశేషాలు తెలుసుకోవడం అంటే అందరికీ ఉత్సాహమే. అందుకే చంద్రునిపై ఏముంది అనే పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మునిగిపోయారు. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు తాజాగా చందమామ మీద ఎదో వింత వస్తువు కనిపించింది అని చెబుతున్నారు.
Updated on: Dec 07, 2021 | 8:28 AM

చంద్రుని అవతలి వైపు ఏముందని 2019 ప్రారంభం నుండి అన్వేషిస్తున్న చైనాకి చెందిన యుటు-2 రోవర్, ఉత్తర హోరిజోన్‌లో ఒక రహస్యమైన క్యూబ్ ఆకారపు వస్తువును గుర్తించింది. దీని ఫోటోలను పరిశోధించడానికి ఇటీవల భూమి పైకి పంపించింది.

చైనీస్ స్పేస్ ప్రోగ్రామ్‌ను కవర్ చేసే జర్నలిస్ట్ ఆండ్రూ జోన్స్ వరుస ట్వీట్ల ద్వారా రోవర్ అప్‌డేట్‌లను పంచుకున్నారు. మొదటి ట్వీట్‌లో, యుటు-2 ఉత్తర హోరిజోన్‌లోని క్యూబిక్ ఆకారంలో ఉన్న వస్తువు చిత్రాన్ని బంధించిందని, అది వాన్ కర్మాన్ క్రేటర్‌లోని రోవర్ నుండి 80 మీటర్ల దూరంలో ఉందని అతను చెప్పాడు.

తదుపరి ట్వీట్‌లో, అతను గ్రైనీ ఇమేజ్‌లో కనిపించే వస్తువు ఒబెలిస్క్ (టాపరింగ్ రాతి స్తంభం) లేదా గ్రహాంతరవాసులు కాదని రాశాడు. కానీ కచ్చితంగా ఇది ఏమిటి అనేది తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆయన అంటున్నాడు. ఇప్పుడు అందిన ఫోటో ద్వారా దీనిని గుర్తించడం కష్టం అని ఆయన చెబుతున్నాడు

మరొక ట్వీట్‌లో, జోన్స్ ల్యాండింగ్ సైట్ నుండి ఈశాన్యం వైపు వెళ్ళేటప్పుడు రోవర్, డ్రైవ్ బృందం క్రేటర్స్ మధ్య ఎలా నావిగేట్ చేశాయో వివరించడానికి ఇది ఒక డ్రైవ్ డైరీ చిత్రం అని చెప్పారు.





























