Andhra Pradesh: వినూత్నంగా రక్షా బంధన్.. చెట్లకు రాఖీ కట్టిన విద్యార్థులు
అన్నా, చెల్లెళ్ళ మధ్య ఉన్న అనుబంధాలకు సూచకంగా దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ నిర్వహించుకుంటుంటే.. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో ఓ ప్రైవేట్ పాఠశాలలో వినూత్నంగా "మనం చెట్లకు రక్షణ-చెట్లు మనకు రక్షణ" అంటూ వృక్షాలకు రాఖీలు కట్టి వినూత్న రీతిలో రాఖీ పండుగ నిర్వహించారు.ముదిగుబ్బ పట్టణంలోని శాంతి ఆనంద పాఠశాలలో వినూత్నంగా రక్షాబంధన్ మహోత్సవాన్ని జరుపుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి స్వయంగా రాఖీలను తయారు చేసుకొని "వృక్షో రక్షతి రక్షితః" అంటూ పాఠశాల ఆవరణలో చెట్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.