సంక్రాంతి స్పెషల్ సకినాలు.. ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు కర కరమని తినెయ్యడమే!

Updated on: Jan 09, 2026 | 1:26 PM

సంక్రాంతి పండగ అంటే చాలు పల్లెల్లో ఉండే సందడే వేరు. ఈ పండుగకు ప్రతి ఒక్కరూ పట్టణం నుంచి పల్లెకు వెళ్లి, ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సంక్రాంతి పండుగ అంటే అందరికీ మందుగా గుర్తు వచ్చేది పిండి వంటలు. ఈ పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ రకరకాల పిండివంటలు తయారు చేస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సకినాలను తయారు చేయడం వెరీ స్పెషల్. అయితే మీరు కూడా మీ ఇంటిలో సకినాలు తయారు చేయాలి అనుకుంటున్నారా. అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సమాచారం.

1 / 5
సకినాలు కరకరమనలే తయారు చేయాలి అనుకుంటున్నారా. అయితే వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సకినాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : బియ్యం కిలో, నువ్వులు 4 టేబుల్ స్పూన్స్, వాము 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడ, నూనె వేయించడానికి సరిపడ.

2 / 5
తయారీ విధానం : ముందుగా బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టాలి.  మధ్యలో  ఒకసారి బియ్యాన్ని శుభ్రంగా కడికి, మళ్లీ కొత్త నీళుపోసి, నానబెట్టాలి. ఇలా చేయడం వలన బియ్యం వాసన రాకుండా ఉంటాయి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని నీటి నుంచి తీసి, ఒక శభ్రమైన క్లాత్‌లో వడకట్టి ఆరబెట్టాలి. ఫ్యాన్ కానీ,  ఎండలో ఎండబెట్టడం కానీ చేయకూడదు.నీళ్లు మొత్తం బియ్యం నుంచి వెళ్లిపోయిన తర్వాత వాటిని మిక్సీలో వేసి, మంచిగా రుబ్బుకోవాలి. చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఎందుకంటే? ఇలా చేయడం వలన సకినాలు చాలా సన్నగా కరకరమనేలా ఉంటాయి.

3 / 5
తర్వాత ఒక గిన్నె తీసుకొని, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో నువ్వులు, వాము, రుచికి సరిపడ ఉప్పు వేసి, కొద్ది కొద్దిగా పిండిని నీళ్లు పోసి కలుపుకోవాలి. మొత్తం ఒకే సారి కలుపుకోవడం వలన పిండి ఎండిపోయి సకినాలు సరిగ్గా రావు.తర్వాత కలుపుకున్న పిండిని, ఒక క్లాత్ వేసి నేలపై. చేతులతో సకినాలలా చేసుకోవాలి. గుడ్రంగా,  ఎగ్గడ విరిగిపోకుండా సకినాలను సరైన ఆకారంలో పోయాలి. ఇలా చేసిన తర్వాత, సకినాలు కొంచెం ఆరిపోతాయి.

4 / 5
 దీని తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి, పెద్ద కడాయి పెట్టి, అందులో సకినాలు వేయించడానికి సరిపడ నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత మనం తయారు చేసుకున్న సకినాలను అందులో వేసుకొని వేయించుకోవాలి.అంతే వేడి వేడి కర కరలాడే సకినాలు రెడీ, వీటిని ఏదైనా బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. నెల రోజుల వరకు నిలువ ఉంటాయి. పిల్లల నుంచి, పెద్దల వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా ఈ సకినాలను తింటారు.

5 / 5
జాగ్రత్తలు : కొంత మంది నువ్వులు, వాము ఆరోగ్యానికి మంచిదని, పిండిలో ఎక్కువ నువ్వులు, వాము కలుపుతుంటారు. కానీ ఇలా చేయడం వలన సకినాల ఆకారం సరిగ్గా రాదు, అంతే కాకుండా, వేయించే క్రమంలో విరిగిపోవడం జరుగుతుంది. అందుకే వీలైనంత వరకు కొలతల ప్రకారమే వాము, నువ్వులు సకినాల పిండిలో కలుపుకోవాలి.