
రోజ్మేరీ ఆయిల్ జుట్టుకు వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు తెల్లబడటం సమస్య ఉంటే రోజ్మేరీ నూనెను రాసుకోవడం కూడా మంచిది. జుట్టుకు రోజ్మేరీ నూనెను ఉపయోగించడం వల్ల చుండ్రును వదిలించుకోవచ్చు.

జుట్టు ఆరోగ్యంతో పాటు, రోజ్మేరీ నూనె ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రోజ్మేరీలో విటమిన్ బి6 మంచి మొత్తంలో ఉంటుంది. దీనితో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

రోజ్మేరీ మొక్క మెదడు ఆరోగ్యానికి మంచిది. దీని వాడకం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. చురుకుదనం, తెలివితేటలు, మంచి కంటి చూపును ప్రోత్సహిస్తుంది. రోజ్మేరీని ఉపయోగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఆందోళన లేదా ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

రోజ్ మేరీ ఆయిల్‌ను కొబ్బరినూనెలో కలిపి వారానికి 3 సార్లు తలకి మసాజ్ చేసుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత షాంపూ చేయాలి. లేదంటే స్ప్రే లాగా రోజు కొద్దిగా స్ప్రే చేసుకోవచ్చు.

రోజ్ మేరీ ఆయిల్‌ని రోజు స్ప్రే లాగా ముందర చుట్టు దగ్గర స్ప్రే చేసుకోవడం ద్వారా.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ ఆయిల్.. జుట్టుకు నిగారింపు, బలాన్ని ఇస్తుంది. రోజ్ మేరీ ఆయిల్‌ను కొబ్బరినూనెలో కలిపి వారానికి 3 సార్లు తలకి మసాజ్ చేసుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత షాంపూ చేయాలి. లేదంటే స్ప్రే లాగా రోజు కొద్దిగా స్ప్రే చేసుకోవచ్చు.