
ఇది యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఇది తల చర్మం దురద, వాపు లేదా ఎరుపుదనాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది తలలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. జుట్టును బలంగా చేస్తుంది. జుట్టు చివర్లు చిట్లడం, చుండ్రు వంటి జుట్టు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.

రోజ్ మేరీ ఆయిల్‌ని రోజు స్ప్రే లాగా ముందర చుట్టు దగ్గర స్ప్రే చేసుకోవడం ద్వారా.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ ఆయిల్.. జుట్టుకు నిగారింపు, బలాన్ని ఇస్తుంది. రోజ్ మేరీ ఆయిల్‌ను కొబ్బరినూనెలో కలిపి వారానికి 3 సార్లు తలకి మసాజ్ చేసుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత షాంపూ చేయాలి. లేదంటే స్ప్రే లాగా రోజు కొద్దిగా స్ప్రే చేసుకోవచ్చు.

రోజ్మేరీ నూనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాలుష్యం, దుమ్ము నుండి రక్షిస్తాయి. ఇవి ముఖంపై గీతలు, మచ్చలను దూరం చేస్తాయి. మీ ముఖం మీద మొటిమలు ఉంటే రోజ్మేరీ ఆయిల్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ ముఖ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ముఖం మీద మొటిమలను నివారిస్తుంది.

ఇది మీ ముఖంపై ఉన్న రంధ్రాలను తగ్గిస్తుంది. ఇది మీ చర్మాన్ని పరిపూర్ణంగా ఉంచుతుంది. రోజ్మేరీ నూనెలో కళ్ళ కింద వాపు, నల్లటి వలయాలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మంలో ఎరుపును తగ్గించి చర్మాన్ని రక్షిస్తాయి.

రోజ్మేరీ మొక్క మెదడు ఆరోగ్యానికి మంచిది. దీని వాడకం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. చురుకుదనం, తెలివితేటలు, మంచి కంటి చూపును ప్రోత్సహిస్తుంది. రోజ్మేరీని ఉపయోగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఆందోళన లేదా ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.