
రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రోజ్ వాటర్ ఉత్తమ ఎంపిక. శీతాకాలంలో మన రోగనిరోధక శక్తి తరచుగా బలహీనపడుతుంది. మీరు కూడా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా రోజ్ వాటర్ తాగాలని చెబుతున్నారు.

రోజ్ వాటర్ ను ముఖానికి స్ప్రే చేయడం వల్ల ముఖంపై ఉండే దుమ్ము, ధూళి క్లీన్ అవుతుంది. క్రమంగా మీ ముఖం మెరుస్తూ ఉంటుంది. ఇది చర్మం సహజ pHని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, పొడిబారడం, జిడ్డును నివారిస్తుంది.

రోజ్ వాటర్‌ని వారానికి రెండు సార్లు చర్మానికి రాసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చే అధిక సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చర్మం ఎరుపు, చర్మశోథ, తామర వంటి వివిధ చర్మ సమస్యలను నివారించడంలో రోజ్ వాటర్ అద్భుతమైన మేలు చేస్తుంది. రోజ్ వాటర్ ని తరచూ ఫేస్ మీద స్పే చేస్తూ ఉంటే.. అలసట తగ్గి, చర్మం తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

తలనొప్పి సమస్యతో బాధ పడేవాళ్లు రోజ్ వాటర్ వాసన చూడటం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు రోజ్ వాటర్ అప్లై చేస్తే జుట్టు మంచి వాసన రావడంతో పాటు స్మూత్ గా మారుతుంది. జుట్టు సంబంధిత సమస్యలకు కూడా రోజ్ వాటర్ తో చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి.

రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్‌లను ముంచి మీ కనురెప్పలపై అప్లై చేస్తే కళ్ల చుట్టూ ఉన్న వేడిని తగ్గిస్తంఉది. తద్వారా మీరు అలసట నుండి తక్షణ ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి. రోజ్ వాటర్ వల్ల దీర్ఘకాలంలో ఎన్నో లాభాలను పొందవచ్చు. రోజ్ వాటర్ ను ఎక్కువగా వాడే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

రోజ్ వాటర్ లో శక్తివంతమైన క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్లను తొందరగా తగ్గిస్తాయి. అందుకే రోజ్ వాటర్ ను తరచుగా వివిధ సహజ, ఔషధ చికిత్సలలో ఉపయోగిస్తారు. కండ్లకలకు తగ్గించడానికి వాడే కంటి చుక్కలలో రోజ్ వాటర్ ను ఉపయోగిస్తారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజ్ వాటర్ లో ఉండే క్రిమినాశక, అనాల్జేసిక్ లక్షణాలు కంటి వ్యాధులను నయం చేస్తుంది.