AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలి కాలంలో తాగాల్సిన పాతకాలపు పానీయం .. రెండు గ్లాసులు తాగితే ఒంట్లో వేడి జారుకుంటుంది

అన్నం వండిన తర్వాత మిగిలిన గంజి నీటిని చాలామంది పనికి రానివిగా భావించి పారబోస్తుంటారు. అయితే, ఈ సాధారణ ద్రవంలో అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు కూడా వెల్లడించారు. ముఖ్యంగా చలి కాలంలో ఎదురయ్యే సమస్యలకు ఇది ఒక పరిష్కారమని చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Nov 12, 2026 | 2:14 PM

Share
అన్నం వండిన తర్వాత మిగిలిన గంజి నీటిని చాలామంది పనికి రానివిగా భావించి పారబోస్తుంటారు. అయితే, ఈ సాధారణ ద్రవంలో అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు కూడా వెల్లడించారు. ముఖ్యంగా చలి కాలంలో ఎదురయ్యే సమస్యలకు ఇది ఒక పరిష్కారమని చెబుతున్నారు.

అన్నం వండిన తర్వాత మిగిలిన గంజి నీటిని చాలామంది పనికి రానివిగా భావించి పారబోస్తుంటారు. అయితే, ఈ సాధారణ ద్రవంలో అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు కూడా వెల్లడించారు. ముఖ్యంగా చలి కాలంలో ఎదురయ్యే సమస్యలకు ఇది ఒక పరిష్కారమని చెబుతున్నారు.

1 / 5

గత తరాల్లో, బియ్యాన్ని పాత్రలో ఉడికించి, దాని నుండి వచ్చిన గంజిని తీసి, కాస్త ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగేవారు. ఈ పద్ధతి ద్వారా బియ్యంలోని పోషకాలు ఏవీ బయటికి వెళ్లకుండా శరీరానికి చక్కగా అందేవి. ఇది శరీరానికి హెవీనెస్ లేకుండానే బలాన్నిచ్చేది. నేటి కాలంలో కుక్కర్‌లో అన్నం వండటం వల్ల గంజి నీరు బియ్యంలోకే ఇంకిపోయి, షుగర్ కంటెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకా గంజిని పారబోయడం వల్ల పోషకాలను కోల్పోతున్నామని చెబుతున్నారు.

2 / 5
గంజి నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ నుండి రక్షించి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు ఒక కప్పు గంజి తాగితే అమృతంలా పని చేస్తుందని, ప్రాణాన్ని నిలబెట్టే సంజీవని అని చెప్పవచ్చు. దీనిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి, గుండెపై భారం పడకుండా చూస్తాయి.

3 / 5
గంజిలో ఉండే స్టార్చ్ జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక ఉత్తమ నివారణ. పిల్లలకు కూడా గంజి నీటిని తాగించవచ్చు. విరేచనాలు అయినప్పుడు గంజి నీటిని తీసుకుంటే వెంటనే ఉపశమనం ఉంటుంది. ఇంకా కడుపులో మంటతో బాధపడుతుంటే, గంజి నీరు దానిని తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
బరువు తగ్గాలనుకునే వారికి గంజి ఒక అద్భుతమైన ఎంపిక. ఇది ఆకలిని నియంత్రించి, తేలికగా ఉంటూనే శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. అన్నం తిన్నప్పుడు కలిగే హెవీనెస్ గంజిలో ఉండదు. ఇంకా దప్పికను ఆకలిగా భ్రమపడి ఎక్కువగా తినకుండా గంజి నివారిస్తుంది, రోజూ గంజి నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. గంజి నీటిలో అమినో ఆమ్లాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

5 / 5
Follow Us