
చాలా మంది టీ తయారు చేసిన తర్వాత టీ డికాషన్‌ను మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తారు. కానీ ఆ టీ డికాషన్‌లో చక్కెర ఉంటే మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. నిజానికి టీ డికాషన్‌లో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంపై ఎక్కడైనా గాయం తగిలితే వినియోగించిన టీ డికాషన్‌ను ఆ ప్రాంతంలో వినియోగించవచ్చు. తద్వారా గాయం త్వరగా నయం అవుతుంది. రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్‌తోనే గడిపితే కళ్లు త్వరగా అలసిపోతాయి. దీనికి ఉపశమనం పొందాలంటే శుభ్రమైన గుడ్డలో వినియోగించిన టీ డికాషన్‌ను ఉంచి కళ్ళపై మెల్లగా కాపడం పెట్టవచ్చు. ఇది కళ్ళకు విశ్రాంతి ఇచ్చి, చూపును మెరుగుపరుస్తుంది. అయితే వినియోగించిన టీ డికాషన్‌ను ఉపయోగించడానికి ముందుగా వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చక్కెరలోని తీపి పోతుంది. ఆ టీ ఆకును వివిధ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించవచ్చు.
పప్పు, కూరగాయలు వంటి ఇతర ఆహార పదార్థాలను పాత్రలలో వండినప్పుడు అవి జిడ్డుగా మారుతాయి. నీటితో కడిగిన తర్వాత కూడా జిడ్డు త్వరగా వదలదు. పాత్రలపై జిడ్డును తొలగించడానికి టీ డికాషన్‌ను బాగా మరిగించాలి. అనంతరం కాచిన టీ నీటితో పాత్రలను శుభ్రం చేస్తే.. తళతళ మెరుస్తాయి.
ఇంట్లో దోమలు, ఈగలు అధికంగా ఉంటే వాటిని వదిలించుకోవడానికి ఉపయోగించిన టీ డికాషన్ బలేగా పనిచేస్తాయి. ముందుగా వాడిన టీ డికాషన్‌ను ఒక కుండ నీటిలో మరిగించాలి. ఆ తర్వాత నీటిని చల్లబరిచి దానితో ఇంటి మొత్తాన్ని గుడ్డతో తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దోమలు, ఈగలు రెండూ పరారవుతాయి.
జుట్టు సంరక్షణకు కూడా టీ డికాషన్ ఉపయోగపడుతుంది. సహజమైన జుట్టు కండిషనర్ కోసం ఉపయోగించిన టీ డికాషన్‌ను శుభ్రమైన నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత, ఆ నీటిని వడకట్టి టీ డికాషన్‌ను వేరు చేసి.. ఆ నీటితో జుట్టును బాగా కడగాలి. ఇది జుట్టును మెరిసేలా చేస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.