
Bread-Butter: ప్రతి రోజూ బటర్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.ఎప్పుడో ఒకసారి వెన్నెను తీసుకోవడం శరీరానికి మంచిదే కానీ రోజూ తింటే ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. బ్రెడ్ పరిస్థితి కూడా అలాంటిదే.

వెన్నలోని సంతృప్త కొవ్వులు నేరుగా ధమనుల్లో పేరుకుపోయి గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇంకా బ్రెడ్ అండ్ బటర్‌ని కలిపి తీసుకుంటే శరీర బరువు పెరగడమే కాక కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.

బ్రెండ్ అండ్ బటర్ పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి పెరిగేలా చేస్తుంది. ఇంకా చర్మంపై మొటిమలు కలుగుతాయి.

బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్, కొవ్వు అధికంగా ఉన్నందున కాల్చకుండా తినడం మంచిది కాదు. అలాగే ఇందులో ఈస్ట్ ఎక్కువగా ఉన్నందును గ్యాస్ట్రిక్ సమస్యల బారిన ప్రమాదం ఉంది.

వైట్ బ్రెడ్ తినడం స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, బొద్దుగా ఉన్నవారు బ్రెడ్‌కి దూరంగా ఉండడం మంచిది.