Vande Bharat: వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడుల వల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా ?

Updated on: Jul 26, 2023 | 6:59 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో దేశంలోని పలుచోట్లు కొంతమంది ఆకతాయిలు ఈ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు వెలుగుచూసాయి. అయితే ఇలా రాళ్ల దాడి చేయడం వల్ల ఎంత నష్టం వచ్చిందో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరించారు.

1 / 5

2 / 5
వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడి చేయడం వల్ల ఇప్పటిదారా దాదాపు రూ.55.60 లక్షల వరకు నష్టం వచ్చిందని వెల్లడించారు. 2019 నుంచి నేటివరకు తమ శాఖకు జరిగిన ఆస్తినష్టం గురించి ఆయన బుధవారం లోక్‌సభలో తెలిపారు.

3 / 5
ఈ రాళ్ల దాడి ఘటనలకు సంబంధించి ఇప్పటిదాకా 151 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో ఎవరూ చనిపోవడం గానీ, దొంగతనం జరగడం గానీ, ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు ధ్వంసం అవ్వడం జరగలేదని తెలిపారు.

4 / 5
ఇలాంటి విధ్వంసాలను అడ్డుకోవడానికి.. ప్రయాణికులను, రైల్వే ఆస్తులను రక్షించేందుకు ఆర్‌పీఎఫ్‌ అధికారులు జీపీఆర్‌/జిల్లా పోలీస్‌/అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగితే దాని పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

5 / 5
వందేభారత్ రైళ్ల విధ్వంసానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్కార్టింగ్ పార్టీలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొ్న్నారు. ఈ రాళ్ల దాడులను నివారించేందుకు మార్గదర్శకాలు జారీచేశామని తెలిపారు. అలాగే ఇందుకోసం రెగ్యులర్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.