Radish Leaves Benefits: ముల్లంగి తిని ఆకులను పడేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే బిత్తరపోతారు

|

Dec 22, 2023 | 11:44 AM

దుంపకూరల్లో ముల్లంగిది ప్రత్యేక స్థానం. చాలామంది ముల్లంగితో సాంబారు, పచ్చడి, కూర వంటివి తయారు చేస్తారు. అయితే ముల్లంగితో ఆహారపదార్ధాలను చేసి.. వాటి ఆకులను చెత్తగా భావించి పడేస్తారు. అయితే ముల్లంగి ఆకుని పడేసే ముందు దానిలోని పోషకాల గురించి తెలుసుకోండి.

1 / 6
 ముల్లంగి ఆకుల్లో పుష్కలంగా పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ఆకుల్లో విటమిన్ కె, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్, కాల్షియం వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. ముల్లంగి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 6
ముల్లంగి ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. ముల్లంగి ఆకులతో చేసిన ఆహారం వదులుగా ఉండే మలం, అసిడిటీ, అపానవాయువు వంటి సమస్యల నుండి రక్షిస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ముల్లంగి ఆకులు మేలు చేస్తాయి.

3 / 6
ముల్లంగి ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్త హీనతతో బాధపడేవారు ముల్లంగి ఆకులను తినే ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

4 / 6
మధుమేహ వ్యాధి గ్రస్తులకు ముల్లంగి ఆకులు మంచి ఆహారం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముల్లంగి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులోని పీచు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

5 / 6
బీపీ సమస్యలతో బాధపడేవారు నిత్యం ముల్లంగి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముల్లంగి ఆకులలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును స్థిరీకరించడంలో సహాయపడుతుంది.

6 / 6
శీతాకాలంలో జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధుల బారిన తరచుగా పడుతూ ఉంటారు. ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.