
బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడింది. చాలా అరుదుగా మన దేశానికి వచ్చింది.

కొన్ని నెలల క్రితం ప్రియాంక, నిక్ దంపతులకు సరోగసీ ద్వారా పాప పుట్టిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పటి వరకు ప్రియాంక తన కూతురు ముఖం చూపించలేదు.

తాజా ప్రియాంక, తన పాపతో కలిసి దిగిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కూడా పాప మొహం చూపించలేదు.

ప్రియాంక చోప్రా తన గారాల పట్టికి మాల్తీ మేరీ అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో తెల్పింది.

కాగా గత కొంతకాలంగా ప్రియాంక, నిక్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు అడపాదడపా వినబడుతూనే ఉన్నాయి. ఈ పుకార్లపై ప్రియంక స్పందించింది. సదరు వార్తలన్నీ అసంబద్ధమని ప్రియాంక స్పష్టం చేసింది.