
అందాలముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది. తన క్యూట్ నెస్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుటుంది.

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఈ మూవీ తర్వాత ఈ చిన్నదానికి వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

దీని తర్వాత ఈ చిన్నది వరుణ్ తేజ సరసన కంచె మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ రావడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటుందని అందరూ ఊహించారు. కానీ ఈ బ్యూటీ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయ్యిందనే చెప్పాలి.

కంచె తర్వాత ప్రగ్యాజైస్వాల్‌కు ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు ఏవీ ఈ అమ్మడుకు మంచి ఫేమ్ తీసుకరాలేకపోయాయి. కానీ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో నటించి మొదటిసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది తర్వాత డాకు మహారాజ్ మూవీలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందకుంది. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదరిపోయే స్టిల్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.