- Telugu News Photo Gallery Political photos Janasena chief Pawan Kalyan visits Pithapuram Dattatreya Kshetra and perform special pooja.
Jana Sena: పిఠాపురం దత్తాత్రేయ ఆలయంలో పవన్ కళ్యాణ్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు..
అష్టాదశ శక్తి పీఠాల్లో మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచిన పిఠాపురం శ్రీ పాదగయ క్షేత్రాన్నిసందర్శించారు. ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated on: Mar 31, 2024 | 4:03 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. శనివారం సాయంత్రం వారాహిపై నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్ షోకు భారీ సంఖ్యలు అభిమానులు తరలివచ్చారు.

ఆ తరువాత అష్టాదశ శక్తి పీఠాల్లో మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచిన పిఠాపురం శ్రీ పాదగయ క్షేత్రాన్నిసందర్శించారు. ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అష్టోత్తర కుంకుమార్చన చేసి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజా క్రతువులను ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్తి చేసి అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు. ఆలయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్‌కు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

మొదట విఘ్నేశ్వరుని పూజించి శ్రీ పాద శ్రీవల్లభుడి మూల స్థానం అయిన అవదంభర వృక్షానికి ప్రదక్షిణలు చేశారు. దత్తాత్రేయ అవతారం అయిన శ్రీ పాదవల్లభుని చరిత్రను ఈ సందర్భంగా అర్చక స్వాములు ఆయనకు వివరించారు.

అనంతరం ఆలయ పండితులు దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీపాద వల్లభుని దర్శనానంతరం స్ఫటిక లింగాకారుడైన శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

అక్కడి నుంచి పురుహుతికా అమ్మవారి దర్శనానికి వెళ్లారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత మహిమాన్విత శ్రీ చక్రాన్ని తాకి మొక్కులు చెల్లించుకున్నారు జనసేనాని.

అనంతరం పురుహుతిక అమ్మవారి ఆలయం మండపంలో వేద ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందచేశారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంలో కాకినాడ లోక్ సభ జనసేన పార్టీ అభ్యర్ధి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజక వర్గ పార్టీ నేతలు పాల్గొన్నారు.
