
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ప్రధాని శుక్రవారం పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు. పలు పార్టీలకు చెందిన నాయకులతో ప్రధాని మధ్యాహ్న భోజనం చేశారు.

అయితే ఈ ఎంపీల జాబితాలో కేవలం బీజేపీకి చెందిన వారు మాత్రమే కాకుండా ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. వీరందరితో మోదీ సరదాగా ముచ్చటిస్తూ భోజనం చేశారు.

వివిధ పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎంపీలను ప్రధాని లంచ్ కోసం ఆహ్వానించారు. సమావేశాల ముగిసిన వెంటనే ఆ ఎంపీలను కలిసి మీకు ఇప్పుడు పనిష్‌మెంట్ ఇవ్వాలి అంటూ కామెడీగా మాట్టారంటా.

ఇక మోదీతో కలిసి భోజనం చేసిన వారిలో బీజేపీ ఎంపీలు హీనా గావిత్, ఎస్ ఫాంగ్నాక్ కొన్యాక్, జమయంగ్ సెరింగ్ నంగ్యాల్, ఎల్ మురుగన్, టీడీపీ ఎంపీ రామ్ మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రాలు ఉన్నారు.

ఈ 8 మంది ఎంపీలకు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాని ఫోన్‌లో లంచ్ సమాచారం అందించారని తెలుస్తోంది. వీరితో కలిసి మోదీ శాఖాహారం తీసుకున్నారు. భోజనంలో భాగంగా రాగి లడ్డూలు స్వీకరించారని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఎంపీలతో మోదీ భోజనం చేసిన సందర్భంగా దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.