
Raksha Bandhan: రాఖీ పండగ వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా హిందూ మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమ, అనుబంధాలను కలగలిపేదే రక్షా బంధన్. అక్క లేదా చెల్లెలు.. తమ సోదరులకు రాఖీ కట్టి.. వారి క్షేమాన్ని, విజయాన్ని కోరుకుంటుంది. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షా బంధన్ సందర్భంగా పిల్లలు మోడీకి రాఖీలు కట్టారు.

సోదరులు కూడా తమ సోదరిని జీవితాంతం రక్షిస్తూ, అండగా ఉంటానని హామీ ఇస్తారు. అయితే చాలా మంది తోడబుట్టిన వారికి మాత్రమే కాకుండా.. సోదరభావంతో మెలిగే వారికి కూడా రక్షాబంధన్ రోజున రాఖీ కడతారు. మోదీకి పిల్లలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏటా చాలా మంది మహిళలు, రాజకీయ నాయకులు, స్కూల్ పిల్లలు కూడా రాఖీలు కడుతూ ఉంటారు.

తన నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీకి బ్రహ్మకుమారిలు రాఖీలు కట్టి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారికి మోదీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి మధ్య పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి నివాళులర్పించారు.