- Telugu News Photo Gallery Photographs of the lighting of the Kartika lamps at the Isha Foundation Coimbatore, Tamil Nadu
Isha Foundation: కార్తీక దీపాల నడుమ వెలిగిపోతున్న ఆది యోగి.. ఈషా ఫౌండేషన్ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు..
ఈరోజు కార్తీక సోమవారం, పైగా పౌర్ణిమ సందర్బంగా వేలదా దీపాలను వెలిగించారు భక్తులు. వేల కార్తీకదీప కాంతుల నడుమ ఈ ప్రాంగణం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ధ్యానలింగం, లింగభైరవి ఆలయాలు, తీర్థ కుండ్లు, నంది, ఆదియోగి తదితర ప్రాంతాలు మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు. నీలి వర్ణ కాంతులతో ఆదియోగి ఈశ్వరుడి విగ్రహం అత్యంత రమణీయంగా కనిపించింది.
Srikar T |
Updated on: Nov 27, 2023 | 11:17 AM

మానసిక ప్రశాంతత కోసం నిత్యం వందల మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. కార్తీక మాసం సదర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అలాగే శివరాత్రిని పురస్కరించుకొని కూడా కొన్ని ఆధ్యాత్మిక భక్తి భావనలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తారు. సముద్ర తీరంలో అతి ఎత్తైన ఆదియోగి శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 112 అడుగులు ఉంటుంది.

ఈ కార్యక్రమంలో పలు ప్రముఖులతో పాటూ ఈశా వాలంటీర్లు పాల్గొన్నారు. నీలి వర్ణ కాంతులతో ఆదియోగి ఈశ్వరుడి విగ్రహం అత్యంత రమణీయంగా కనిపించింది.

తమిళనాడులోని కోయంబత్తూరులో అతి పెద్ద ఈశా ఫౌండేషన్ ఆశ్రమాన్ని స్ధాపించారు సద్గురు. ఆధ్యాత్మిక భావనను నరనరాన ఇనుమడింపజేస్తుంది.

ఈరోజు కార్తీక సోమవారం, పైగా పౌర్ణిమ సందర్బంగా వేలదా దీపాలను వెలిగించారు భక్తులు. వేల కార్తీకదీప కాంతుల నడుమ ఈ ప్రాంగణం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ధ్యానలింగం, లింగభైరవి ఆలయాలు, తీర్థ కుండ్లు, నంది, ఆదియోగి తదితర ప్రాంతాలు మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు.





























