Health Tips: అవునా..? ఈ సమస్యలు ఉన్నవారు అంజీర్పండ్లని అస్సలు తినొద్దు..చాలా ప్రమాదం..!
పుష్కలమైన పోషక విలువలు కలిగిన అంజీర్ పండ్లు శరీరాన్ని బలోపేతం చేస్తాయి. జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి. అంజీర్ పండ్లలో ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి తగినంత పోషణను అందిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ ప్రేగులను శుభ్రపరుస్తుంది. దీని తరచుగా తినడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం వంటి జీర్ణ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అంజీర్ పండ్లు అందరికీ సరిపడవని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అంజీర్ పండ్లు తినకూడదో ఇక్కడ చూద్దాం...
అంజీర్ పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అవి పోషకాల నిధి. కానీ కొందరు అంజీర్ పండ్లను తినకూడదు.. ఎందుకంటే.. అంజీర్ పండ్లలో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. కాబట్టి, మధుమేహ రోగులు వాటిని అతిగా తినకూడదు. తినకపోవడమే మంచిది.
రక్తం పలుచబరిచే మందులు తీసుకునేవారు అంజీర్ పండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే..ఎందుకంటే ఈ పండ్లలో సహజ సమ్మేళనాలు రక్తాన్ని మరింత పలుచగా చేస్తాయి. అంజీర్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చాలా మందికి వాటిని తిన్న తర్వాత గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు కలిగిస్తుంది.
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు అంజీర్ పండ్లు తినకూడదు. ఎందుకంటే వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్న వారిలో అసమతుల్యతను కలిగిస్తుంది. పెద్ద మొత్తంలో వీటిని తినడం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా తగ్గడం లేదా పెరుగుతుంది. అందువల్ల వైద్యుడి సలహా మేరకు మితంగా తీసుకోవటం మంచిది.
తరచూ విరోచనాలు, కడుపునొప్పి, గ్యాస్ , కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు అంజీర్ పండ్లు తినకూడదు. ఎందుకంటే.. అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సరిగా లేని వారిలో విరేచనాలను మరింత పెరిగేలా చేస్తుంది.
అలాగే, గర్భిణీలు కూడా అంజీర్ పండ్లు ఎలా పడితే అలా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి శరీర వేడిని పెంచుతాయి. అధికంగా తీసుకుంటే కడుపు సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి, వీటిని తినేముందు వైద్యుడుని తప్పనిసరిగా తీసుకోవాలి.