
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలయికనే కాదు, కొన్ని సార్లు రెండు గ్రహాలు చాలా దగ్గరగా వస్తుంటాయి. అయితే ఈ సెప్టెంబర్ నెలలో బుధ గ్రహం, శని గ్రహం ఒకదానికి ఒకటి దాదాపు 180 డిగ్రీల కోణంలో దగ్గరకి వచ్చాయి. అయితే 50 సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ ఘటన 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు తీసుకొస్తుంది.

మిథున రాశి : ఈ రాశి వారికి అనుకున్నపనులన్నీ సకాలంలో పూర్త అవుతాయి. బుధ, శని గ్రహాల వలన ఈ రాశి వారు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలన్నీ పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మధ్యలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి చేసి, చాలా సంతోషంగా జీవిస్తారు.

తుల రాశి : తుల రాశి వారికి ఈనెల మొత్తం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చివరి రెండు వారాలు పట్టిందల్లా బంగారమే కానుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది.

మీన రాశి : ఈ రాశి వారికి శని, బుధ గ్రహాలు చేరువలోకి రావడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు అనేక లాభాలు పొందుతారు. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి వారిని అదృష్టం తలుపుతడుతుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జీవిస్తారు. పట్టిందల్లా బంగారమే కానున్నది.

మీన రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. అనుకున్న పనుల్నీ సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు.