
బొప్పాయిలో ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఉపరితలం నుండి చనిపోయిన, దెబ్బతిన్న కణాలు, కణజాలాలు, పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది. బొప్పాయి చర్మాన్ని కాంతివంతంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుంది.

బొప్పాయిలో పపైన్, చైమో పపైన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయిలో విటమిన్ ఏ మొటిమలను తగ్గిస్తుంది. బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా. ఇది చర్మం సహజ తేమను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ మొటిమల మచ్చలు, మోచేతులు, మోకాళ్లపై వంటి నల్లటి చర్మపు మచ్చలకు అద్భుతమైన నివారణగా పని చేస్తుంది.

చర్మం దురద, ఎరుపుదనాన్ని తగ్గించడంతో బొప్పాయి సహాయపడుతుంది. బొప్పాయిలో మొక్కల ఆధారిత యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉంటాయి. ఇవి మృతకణాలను తొలగిస్తాయి. బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్ చేసుకుంటే చర్మంపై మురికి మొత్తం క్లీన్ అవుతుంది.

బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా. ఇది చర్మం సహజ తేమను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ మొటిమల మచ్చలు, మోచేతులు, మోకాళ్లపై వంటి నల్లటి చర్మపు మచ్చలకు అద్భుతమైన నివారణగా పని చేస్తుంది.

చర్మం మెరిసేలా, మృదువుగా చేయడానికి మీరు బొప్పాయి స్క్రబ్‌ని కూడా ఉపయోగించవచ్చు. బొప్పాయిలోని ఎంజైమ్‌లు మృత చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. చర్మంలోని మలినాలను తొలగిస్తాయి. బొప్పాయి గుజ్జును చర్మంపై అప్లై చేయడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులు కూడా నయం అవుతాయి. చర్మంపై దురద, ఎరుపును తొలగించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.