Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukshar Dhillon: గులాబీలోని సొగసు.. వెన్నలలోని అందం ఈమె సొంతం.. డేజ్లింగ్ రుక్సార్..

రుక్సార్ ధిల్లాన్ ప్రధానంగా తెలుగు, హిందీ, కన్నడ చిత్రాలలో కథానాయకిగా నటిస్తుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. తెలుగు ఎక్కువ సినిమాల్లో కనిపించింది. వీటిలో కొన్ని విజయాన్ని అందుకున్నాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‎గా ఉంటూ తన ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

Prudvi Battula

|

Updated on: Feb 02, 2025 | 3:40 PM

12 అక్టోబర్ 1993న లండన్‌లో పంజాబీ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రుక్సార్ ధిల్లాన్. యూకేలో పుట్టినప్పటికీ గోవాలో పెరిగింది. ఈ ముద్దుగుమ్మ కుటుంబం ఇప్పుడు కర్ణాటకలోని బెంగళూరులో స్థిరపడింది.

1 / 5
 ఇండియాలోనే ఓ ప్రముఖ కళాశాల నుంచి ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పట్ట పొందింది అందాల తార రుక్సార్ ధిల్లాన్. 2016లో రన్ ఆంటోనీతో సినీరంగ ప్రవేశం చేసింది. 2017లో ఆకతాయి అనే సినిమాతో తెలుగు చలనచిత్రం అరంగేట్రం చేసింది.

2 / 5
ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధంలో హీరోయిన్‎గా తన నటనతో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ అనే సినిమాలో చేసింది. ఇది ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

3 / 5
తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది. ఇందులో రుక్సార్ ధిల్లన్ సెకండ్ హీరోయిన్. స్పార్క్‌ ఎల్‌.ఐ.ఎఫ్.ఈ అనే సినిమాలో కనిపించింది. 2024లో నా సామిరంగా సినిమాల్లో నటించింది రుక్సార్ ధిల్లన్.

4 / 5
2022 నుంచి లయన్స్‌గేట్ ఇండియాలో ప్రసారం అవుతున్న జుగాదిస్తాన్ అనే బాలీవుడ్  కామెడీ డ్రామా వెబ్‎సిరీస్‎లో తొలిసారి  హిందీ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో కథానాయకిగా రాణిస్తుంది ఈ వయ్యారి.

5 / 5
Follow us