3 / 7
సినీ ఫక్కీలో సాగిన యాక్షన్ ఎపిసోడ్‌లో పోలీసులు అల్లరిమూకలు తమ పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జనం ఆ తరువాత ఔరా అనుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయపార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి, కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్దంగా ఉన్నారని తెలియచెప్పడానికి ఒంగోలులో పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మాక్ డ్రిల్ నిర్వహించారు.