White Jamun Benefits: వాటర్ యాపిల్స్ రెగ్యులర్‌గా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..? ఊహించని ప్రయోజనాలు!
మార్కెట్లో వాటర్ యాపిల్స్ మీరు చేసే ఉంటారు. వీటిని వైట్ జామున్ అని కూడా అంటారు. పరిమాణంలో చిన్నదైనప్పటికీ నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో కూడా ఈ పండ్లు లభిస్తాయి. ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కాలంలో వచ్చే నేరేడు పళ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. కానీ వాటర్ యాపిల్ ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నిజానికి ఇవి స్థానికంగా ఎక్కువగా పండవు..
Updated on: Jun 18, 2024 | 12:49 PM

మార్కెట్లో వాటర్ యాపిల్స్ మీరు చేసే ఉంటారు. వీటిని వైట్ జామున్ అని కూడా అంటారు. పరిమాణంలో చిన్నదైనప్పటికీ నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో కూడా ఈ పండ్లు లభిస్తాయి. ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ కాలంలో వచ్చే నేరేడు పళ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. కానీ వాటర్ యాపిల్ ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నిజానికి ఇవి స్థానికంగా ఎక్కువగా పండవు. ఆగ్నేయాసియాకు చెందిన స్థానిక పండు ఇది. మనదేశంలో కూడా వాటర్ యాపిల్స్ ఒడిశా, మహారాష్ట్రతో సహా అనేక ప్రాంతాల్లో సాగు చేస్తారు. దీనిని రోజ్ యాపిల్ అని కూడా అంటారు.

వేసవిలో వాటర్ యాపిల్స్ తినడం చాలా ప్రయోజనం పొందవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేసవిలో వాటర్ యాపిల్స్ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రోగనిరోధక శక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా వాటర్ యాపిల్స్ సహాయపడుతాయి. అందుకే దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వాటర్ యాపిల్స్‌లో నిండుగా నీరు ఉంటుంది. ఈ పండును విపరీతమైన వేడిలో తినడం ద్వారా హీట్ స్ట్రోక్ ను నివారించవచ్చు. వాటర్ యాపిల్స్ నీటితో నిండి ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. వీటిల్లో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, ఈ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అపానవాయువు, అజీర్ణం తగ్గుతుంది.




