
సోమవారం- వెజ్ ఉప్మా: మండే రోజులు పిల్లల బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ కోసం మీరు 'వెజ్ ఉప్మా' చేయవచ్చు. దీనిలో ఉండే పోషకాతో ఇది రుచితో పాటు మీ పిల్లలకు ఆరోగ్యంగానూ ఉంటుంది. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ముందు రోజు రాత్రే ఉప్మా రవ్వను వేయించి, కూరగాయలను తరిగి పెట్టుకుంటే మార్నింగ్ మీరు జస్ట్ 5 నిమిషాల్లోనే దీన్ని తయారు చేయెచ్చు. దీని కోసం మీ ఇంట్లో ఉల్లిపాయ, బఠానీ, టొమాటో, బీన్స్, క్యారెట్ లాంటి కూరగాయలను ఉండే సరిపోతుంది.

మంగళవారం - వెజ్ బర్గర్: మంగళవారం రోజు 'వెజ్ బర్గర్'ట్రై చేయండి. బయట కొనే బర్గర్ కంటే మీరు ఇంట్లో చేసేది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తినేందుకు పిల్లలు ఎంతగానో ఇష్టపడుతారు. దీన్ని తయారుచేసేందుకు బర్గర్ ప్యాటీని (టిక్కీ) ముందు రోజు రాత్రే సిద్ధం చేసుకుంటే, ఉదయాన్నే లైట్‌గా ఫ్రై చేసి, బర్గర్ బన్‌ను వేడి చేసి, కాస్త చట్నీ రాసి పిల్లలకి ప్యాక్ చేసేయవచ్చు. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు.

బుధవారం - వెజ్ ఫ్రాంకీ రోల్స్ : బుధవారం వెజ్ ఫ్రాంకీ రోల్స్ ట్రై చేయండి. చపాతీపై కొద్దిగా పుదీనా చట్నీ, కొంచెం టొమాటో సాస్ రాసి, మీకు నచ్చిన ఏదైనా డ్రై వెజిటెబుల్ ఫ్రై (కూర)ను మధ్యలో స్టఫ్ వేసి దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానిపై కొద్దిగా ఫ్రెష్ సలాడ్ ముక్కలను చల్లి, రోల్‌లా చుట్టి పిల్లల టిఫిన్ బాక్స్‌లో పెడితే లంచ్ బాక్స్ రెడీ. పిల్లలు దీన్ని ఆడుకుంటూ కూడా చాలా ఈజీగా తినేస్తారు.

గురువారం - వెజ్ ఇడ్లీ: గురువారం వెజ్ ఇడ్లీ ట్రై చేయండి.దీన్ని చాలా త్వరగా అండ్ ఈజీగా చేయవచ్చు. దీనికోసం ముందు రోజు రాత్రే ఇడ్లీ పిండిని సిద్ధం చేసుకోండి. అందులో మీకు నచ్చిన కూరగాయలైన ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, బఠానీ వంటివి సన్నగా తరిగి వేసి, ఉదయాన్నే ఇడ్లీలను ఉడికిస్తే సరిపోతుంది. వీటిపై ఆవాలు, కరివేపాకుతో తిరగమాత పెట్టి లంచ్ బాక్స్‌లో పెడితే, పిల్లలు ఎంత వేగంగా బాక్స్ ఖాళీ చేస్తారు.

శుక్రవారం - హెల్తీ ఫ్రైడ్ రైస్: శుక్రవారం ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. దీనికోసం ఉదయాన్నే లేచి ప్రత్యేకంగా అన్నం వండాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ముందు రోజు రాత్రి మిగిలిన అన్నం ఉంటే, అందులో మీకు నచ్చిన కూరగాయ ముక్కలను వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత కొద్దిగా సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ వేసి, అన్నం కూడా వేసి బాగా టాస్ చేసి లంచ్ బాక్స్‌లో పెట్టేయండి. ఇది లంచ్‌లోకి చాలా బాగుంటుంది.

శనివారం - ఆప్షనల్: అన్ని రోజు మనకు నచ్చిన లంచ్ బాక్స్ పెట్టినా.. శనివారం మాత్రం పిల్లల ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వండి. సాధారణంగా పిల్లలు పాస్తా, నూడుల్స్ తినేందుకు ఇష్టపడుతారు. ఇవి మైదాతో చేయడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాకపోయినా, వారానికి ఒక రోజు తింటే తప్పులేదు. కాబట్టి శనివారం మీ పిల్లలకి 'పాస్తా సలాడ్' లేదా నూడుల్స్ చేసి ఇవ్వవచ్చు.