
భారతదేశంలో ఫ్యాషన్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. చీరలది ప్రత్యేక స్థానం. అందునా చేనేత చీరలు శతాబ్దాలుగా భారతీయ మహిళల గర్వానికి, శైలికి చిహ్నంగా ఉన్న అమూల్యమైన వారసత్వం. ఈ చీరలు కేవలం వస్త్రం మాత్రమే కాదు.. కృషి, నైపుణ్యం, సంస్కృతి, మన కళాకారుల ప్రతిభకు అద్దం కూడా. పెళ్లి, పండుగ, పార్టీ ఇలా ఏ సందర్భమైనా సరే చేనేత చీరలు ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా చేస్తాయి. జనసమూహం నుంచి మిమ్మల్ని భిన్నమైన, పరిపూర్ణమైన రూపాన్ని ఇస్తూ ప్రత్యేకంగా నిలనేడతాయి. వార్డ్‌రోబ్‌లో కొత్త చీరలకు చోటు ఇవ్వాలని భావిస్తుంటే.. ఈ 5 చేనేత చీరలు మంచి ఎంపిక. మీ వార్డ్‌రోబ్‌కు గర్వకారణం.

బనారసి చీర: బనారసి చీర దీని సంక్లిష్టమైన జరీ వర్క్, అందమైన అల్లికలు, పూలు, ఆకులు తీగలతో ఆకట్టుకునే రూపంతో ప్రపంచ వాప్తంగా ప్రసిద్ధి చెందింది. వివాహాలు, పండుగల ఏ ముఖ్యమైన సమయంలోనైనా సరే బనారసి చీరలు ఉండాల్సిందే. ఆకృతి, బంగారం, వెండి బ్రోకేడ్ పనితో చాలా అందంగా ఉంటాయి, దీనిని సతత హరిత ఫ్యాషన్ ఐకాన్‌గా పరిగణిస్తారు.

కాంచీపురం పట్టు చీర: భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పట్టు చీరలలో ఒకటి.. వీటినికంజీవరం చీరలు అని కూడా పిలుస్తారు. వీటిని స్వచ్చమైన పట్టుతో తయారు చేస్తారు. దీని మెరిసే పట్టు, బంగారు జరీ బోర్డర్ వివాహాలు , గొప్ప వేడుకలకు ఉత్తమ ఎంపికగా చేస్తుంది. ప్రతి స్త్రీ తన వార్డ్‌రోబ్‌లో కనీసం ఒక కాంచీపురం చీరను కలిగి ఉండాలని కోరుకుంటారు.

టాంట్ చీరలు టాంట్ చీరలు బెంగాల్ ప్రాంతానికి చెందిన చేతితో నేసిన కాటన్ చీరలు. ఇవి చాలా తేలికైన, సున్నితంగా పారదర్శకంగా ఉంటాయి. ధరిస్తే మృదువైన అనుభూతినిస్తాయి. ఈ చీర ఆఫీసు లేదా డే టైం పార్టీకి చాలా సౌకర్యవంతమైన, స్టైలిష్ ఎంపిక. అంతేకాదు భారతీయ వాతావరణానికి అనుకూలమైనవి.

ఖాదీ చీర ఖాదీ అంటే 'చేతితో నేసినది' అని అర్థం. ఈ చీరలు ముఖ్యంగా సౌకర్యవంతంగా ఉంటాయి. ఖాదీ చీరలు సహజ పదార్థాలతో తయారు చేయబడతాయి. కనుక ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి. ఇవి స్వదేశీ ఉద్యమంలో ముఖ్యమైన భాగం పోషించాయి. ఆధునిక యుగంలో కూడా ఈ చీర స్టైలిష్‌గా, సరళంగా కనిపిస్తుంది. ఖడ్డీ చీర ప్రతి మహిళల వార్డ్ రోబ్ లో తప్పనిసరిగా ఉండాలి.

చందేరి చీర చందేరి చీర మధ్యప్రదేశ్ కు చెందిన ఒక ప్రత్యేక చేనేత చీర. ఇది తేలికైనది, పారదర్శకమైనది. చాలా అందంగా ఉంటుంది. ఇది పట్టు. పత్తి కలయికతో తయారు చేసే చీరలు. ఇవి ధరించడానికి సౌకర్యంగా ఉంటాయి. వీటి అందమైన డిజైన్, జరీ వర్క్ చందేరి చీరలను ప్రత్యేకంగా చేస్తాయి. చందేరి చీర పండుగలు, పార్టీలు రెండింటికీ సరైన ఎంపిక.