
(మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు వెస్టర్న్ ఘాట్స్) పశ్చిమ కనుమలంటేనే ప్రకృతి అందాల నిలయం. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ప్రాంతం వర్షాకాలంలో చాలా అందంగా మారిపోతుంది. జలపాతాలు పొంగి పొర్లుతాయి, అడవులు పొగమంచుతో నిండిపోతాయి. అగుంబే, మున్నార్, వాయనాడ్ లాంటి ప్రాంతాల్లో నడిచి వెళ్తే చెప్పలేని అనుభవం కలుగుతుంది.

(ముంబై, మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) ముంబైకి వర్షాలు ఒక భాగం. వర్షంలో ఈ విక్టోరియన్ గోథిక్ శైలిలో కట్టిన రైల్వే స్టేషన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ గోధుమ రంగు భవనం, చీకటి వాతావరణం కలిపి సినిమా దృశ్యంలా ఉంటుంది. ఇది కేవలం రైల్వే స్టేషన్ కాదు.. ఒక ముఖ్యమైన చారిత్రక భవనం.

(అస్సాం కాజిరంగా నేషనల్ పార్క్) వర్షాకాలం రాగానే కాజిరంగా పార్క్ మరింత అందంగా తయారవుతుంది. చాలా ఎక్కువ సంఖ్యలో ఒక్క కొమ్ము గల గండ్ర మృగాలు (one horned rhinoceroses) ఉన్న ఈ యునెస్కో ప్రదేశం వర్షాల వల్ల ప్రాణంతో నిండిపోతుంది. పచ్చని గడ్డి, చెట్లు, నీటితో నిండిపోయిన నదులు.. పక్షులు, జంతువులు బయటికి వచ్చి ప్రకృతిని మరింత అందంగా చేస్తాయి.

(బీహార్ బోధ్ గయా మహాబోధి ఆలయం) వర్షాకాలంలో ప్రశాంతమైన ప్రదేశం కావాలనుకునే వాళ్లకు బోధ్ గయాలోని మహాబోధి ఆలయం సరైన చోటు. గౌతమ బుద్ధుడు ఇక్కడే జ్ఞానాన్ని పొందారు. వర్షం పడేటప్పుడు ఈ ఆలయం నిశ్శబ్దంగా, ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. బోధి చెట్టు వర్షపు చినుకులతో మెరిసిపోతుంది. సన్యాసులు మంత్రాలు చదువుతుండగా.. వర్షపు చినుకుల శబ్దం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

రన్ థాంబోర్ (Ranthambore), చిత్తోర్గఢ్ (Chittorgarh), కుంభల్ ఘఢ్ (Kumbhalgarh) రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్.. రాజస్థాన్ అంటే ఎండగా ఉంటుంది అనుకుంటాం.. కానీ వర్షాకాలంలో ఈ ప్రాంతం వింతగా మారిపోతుంది. కొండలపై ఉన్న కోటలు.. రణ్‌థంబోర్, కుంబల్గఢ్ ఆకాశాన్ని తాకేలా పొగమంచులో తేలియాడుతూ కనిపిస్తాయి. చుట్టూ ఉన్న కొండలు పచ్చగా మారతాయి. వానలో నాట్యం చేస్తున్న నెమళ్లు, నీటితో నిండిన చెరువులు ఈ కోటలకు కొత్త అందాన్ని ఇస్తాయి.