Night Workout: రాత్రిళ్లు జిమ్‌లలో కసరత్తులు చేస్తున్నారా? ఐతే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
శరీరంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలంటే ప్రతి రోజూ వర్కవుట్ చేయడం చాలా అవసరం. మధుమేహం, అధిక బరువు, అధిక రక్తపోటు వంటి వ్యాధులు దరచేరకుండా నివారించడంలో వ్యాయామం తోడ్పడుతుంది. అందుకే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న కొందరు..
Updated on: Nov 07, 2022 | 2:43 PM

శరీరంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలంటే ప్రతి రోజూ వర్కవుట్ చేయడం చాలా అవసరం. మధుమేహం, అధిక బరువు, అధిక రక్తపోటు వంటి వ్యాధులు దరచేరకుండా నివారించడంలో వ్యాయామం తోడ్పడుతుంది. అందుకే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న కొందరు తూచ తప్పకుండా శారీరక కసరత్తులు చేస్తుంటారు. మరికొందరు సమయం లేక రాత్రిపూట వర్కవుట్‌లు చేస్తుంటారు. ఐతే చాలా మందికి ఉదయం-రాత్రి సమయాల్లో ఎప్పుడు జిమ్ వర్కౌట్లు అధిక ప్రయోజనం కలుగజేస్తాయనే విషయంలో కొంత సందిగ్ధత ఉంది. నిపుణులు ఏమంటున్నారంటే..

రాత్రిళ్లు జిమ్‌లో కసరత్తులు చేసే కంటే పగటి పూట చేయడమే బెటర్. ఎందుకుంటే రాత్రిళ్లు జిమ్‌కు వెళ్లే వారికి అర్థరాత్రి వరకు నిద్ర పట్టదు. ఎందుకంటే.. జిమ్‌లో వర్కవుట్ చేసే సమయంలో.. హృదయ స్పందన రేటును గణనీయంగా పెరుగుతుంది. అలాగే శరీర కండరాల్లో ఆక్సిజన్ స్థాయి, రక్త ప్రసరణ పెరుగుతుంది.

సాధారణంగా ఆకలి అనిపిస్తుంది. కడుపు నిండా తింటారు. ఈ విధంగా భారీగా ఆహారం తీసుకున్న తర్వాత జిమ్ చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

రాత్రిపూట జిమ్‌లో హెవీ వర్కవుట్‌లు చేసే అలవాటున్నవారి కండరాలకు హాని తలెత్తుతుంది. ఎందుకంటే భారీ వర్కౌట్ల తర్వాత కండరాలకు విశ్రాంతి అవసరం. అవి సేద తీరడానికి తగినంత విరామం అవసరం. లేదంటే కండరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

రాత్రిపూట జిమ్‌లో భారీ వర్కవుట్‌లు చేసే వారి నాడీ వ్యవస్థ త్వరగా దెబ్బతింటుంది. వర్కవుట్ల తర్వాత నాడీ వ్యవస్థ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. ఫలితంగా కండరాలు, శరీర నొప్పులు తీవ్రంగా వస్తాయి.




