Monsoon Diet: చేపలు ఆరోగ్యానికి మంచివే.. ఈ సీజన్ లో తింటే వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్లే.. జాగ్రత్త సుమా..

Updated on: Jul 10, 2025 | 6:02 PM

నాన్ వెజ్ ప్రియుల్లో సీఫుడ్ ప్రియులు వేరు.. చేపలను ఇష్టంగా తింటారు. చేపలు రుచిక్రమైనవి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అయితే వర్షాకాలంలో చేపలను తినడం ఆరోగ్యానికి మంచిదా..! కదా అనే విషయం కొంత కాలంగా చర్చనీయాంశంగా మారింది. పోషకాల వనరులైన చేపలను ఈ సీజన్ లో తినాలా వద్దా ఈ రోజు తెలుసుకుందాం..

1 / 6
వర్షాకాలం ప్రారంభమయింది. మండే వేడి నుంచి ఉపశమనం కలిగించి.. పర్యావరణాన్ని పునరుజ్జీవింపజే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తినే ఆహారం విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ సమయంలో చేపలను తినేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో చేపల రుచి, తాజాదనం కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చేపల సంతానోత్పత్తి కాలం. చేపల్లోపోషకాలు అధికంగా ఉండవచ్చు. ఈ సీజన్ లో చేపలను తినడం వలన ఆరోగ్యానికి ప్రమాదాలు ఎదురవుతాయి. వర్షాకాలంలో చేపలను ఎందుకు తినకూదదో ఈ రోజు తెలుసుకుందాం..

2 / 6

వర్షాకాలంలోని నీటిలో కలుషితాలు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కనుక ఈ ప్రభావం చేపలపై కూడా పడుతుంది. అంతేకాదు చేపల రవాణా, చేపలను నిల్వ చేసే విధానం సరైనవి కాకపోవచ్చు, కనుక చేపల్లో బ్యాక్టీరియా పెరుగుదల, ఆహారం చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒకొక్కసారి చేపలు అమ్మేవారు లేదా కొన్నవారు చేపలను నిల్వ చేసే విధానంలో రాజీ పడవచ్చు. అప్పుడు చేపలలో బ్యాక్టీరియా పెరిగి ఆనారోగ్యాన్ని కలిగించవచ్చు.

3 / 6
వర్షాకాలంలో వర్షాల వలన నీటి కాలుష్యానికి, సూక్ష్మజీవుల పెరుగుదలకు కారణం అవుతాయి. ఇవి జల పర్యావరణ వ్యవస్థలపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఫలితంగా చేపలు నివసించే నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, పరాన్నజీవులు, విషపదార్థాలకు గురవుతాయి. కలుషితమైన చేపలను తినడం వల్ల గ్యాస్ట్రోఎంటెరిటిస్, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఎ వంటి ఆహార సంబంధిత అనారోగ్యాలు వస్తాయి. అంతేకాదు వర్షాకాలంలో అధిక తేమ చేపలు వేగంగా చెడిపోయేలా చేస్తాయి. అవి తాజాగా కనిపించినప్పటికీ తినడానికి సురక్షితం కాదు.

4 / 6
వర్షాకాలంలో నీటి వనరులు కలుషితం కావడం వల్ల నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. నీటి వనరులలో నివసించే చేపలు ఈ వ్యాధులకు గురవుతాయి. ఉదాహరణకు, జంతువుల మూత్రం ద్వారా కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే లెప్టోస్పిరోసిస్ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వర్షాకాలంలో సర్వసాధారణం. ఈ ఇన్ఫెక్షన్ సోకిన చేపలను తినడం వల్ల వ్యక్తులు అటువంటి వ్యాధులకు గురవుతారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడతారు.

5 / 6
వర్షాకాలం చేపల పెంపకానికి కీలకమైన సమయం. చాలా చేపలు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేస్తాయి. కనుక ఈ సమయంలో వీటిని పట్టడం వల్ల వాటి పునరుత్పత్తి చక్రాలకు అంతరాయం కలుగుతుంది. కనుక చేపల పునరుత్పత్తి చేయడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి వీలుగా చేపలను ఆహారంగా తీసుకోకూడదు.

6 / 6
చేపలు ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఇతర ముఖ్యమైన పోషకాలకు మూలం. అయినప్పటికీ వర్షాకాలంలో చేపలను తినే విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. బాక్టీరియా, పరాన్నజీవులు, విషపదార్థాలతో కలుషితమైన చేపలను తినడం వల్ల కలిగే ప్రమాదాలు అనేకం కనుక. చేపలను తినడం వలన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు పెరుగుతాయి. అంతేకాదు జల పర్యావరణ కోసం కూడా చేపలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.