
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజం. ప్రతి నెల రోజులకు ఒకసారి లేదా కొన్ని గ్రహాలకు సంవత్సరాని, ఆరు నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. అయితే శక్తివంతమైన గ్రహాల్లో కుజ గ్రహం ఒకటి. ఈ గ్రహం జూలై 29న కన్యా రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి : మిథున రాశి వారికి కుజుగ్రహ సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి : కుజ గ్రహ సంచారం వలన తుల రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న వారి కలలు నిజం అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సొంతం అవుతుంది.

సింహ రాశి : శ్రావణ మాసంలో కుజ గ్రహం సంచారం వలన సింహ రాశి వారికి అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి వ్యాపారల్లో పెట్టుబడులు కనిపిస్తాయి . అంతే కాకుండా సింహ రాశి వారు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

కుంభ రాశి : ఆగస్టు 13 వరకు వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం అందుకుంటారు. ధనయోగం ఉంది. ఆర్థికంగా అనేక లాభాలు చేకూరుతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు.