
వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో లవంగాలు కూడా ఒకటి. లవంగాలను ఎక్కువగా మసాలా వంటల తయారీలో ఉపయోగిస్తారు. వంటకు మంచిని రుచిని తీసుకొస్తాయి లవంగాలు. వీటిని కేవలం వంటల్లోనే కాకుండా మంచి కిచెన్ హ్యాక్స్, హోమ్ రెమిడీస్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.

లవంగాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. లవంగాలే కాకుండా లవంగాల నీరు కూడా శరీరానికి చాలా మంచి చేస్తుంది. ప్రతి రోజూ ఒక లవంగాన్ని బుగ్గల్లో పెట్టుకుంటే.. పంటి నొప్పి, నోటి దుర్వాసన, జలుబు, దగ్గు వంటివి కంట్రోల్ అవుతాయి.

లవంగాల నీరు తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ప్రతిరోజూ ఈ నీటిని తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మంచి మెడిసిన్‌లా పని చేస్తుంది.

మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ నీటిని తాగితే.. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య ఉండదు.

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం లవంగం నీటిని పుక్కలించి ఊయడం వల్ల నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. ఉదయం పరగడుపున లవంగం నీటిని తాగితే డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)