Viral: బ్యాంకాక్ నుంచి ప్లాస్టిక్ బాక్సులతో వచ్చిన ప్రయాణికుడు.. అనుమానం వచ్చి చెక్ చేయగా.. వామ్మో..

Updated on: Aug 24, 2023 | 11:17 AM

అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారు. విదేశాల నుంచి స్వదేశానికి ఎలాంటి అనుమతులు లేకుండా బంగారం, డ్రగ్స్, వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. అలాంటి వారికి కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా షాకిస్తున్నారు. తాజాగా.. బెంగళూరు ఎయిర్ పోర్టులో షాకింగ్ సీన్ వెలుగు చూసింది.

1 / 7
అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారు. విదేశాల నుంచి స్వదేశానికి ఎలాంటి అనుమతులు లేకుండా బంగారం, డ్రగ్స్, వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. అలాంటి వారికి కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా షాకిస్తున్నారు. తాజాగా.. బెంగళూరు ఎయిర్ పోర్టులో షాకింగ్ సీన్ వెలుగు చూసింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు వందలాది అరుదైన వన్యప్రాణులతో భారత దేశానికి వచ్చాడు.

2 / 7
ముందుగా ఎవరికీ అనుమానం రాకుండా అనుకున్నట్లుగా ఓ బాక్సులో వన్యప్రాణులను బాక్సుల్లో పార్శిల్ చేశాడు. ఆ తర్వాత వాటిని తీసుకుని.. ఫ్లైట్ ఎక్కి బెంగళూరుకు వచ్చాడు. అతనిపై అనుమానం వచ్చి బెంగళూరు కస్టమ్స్ అధికారులు.. ఆపి ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం వెలుగులోకి చ్చింది.

3 / 7
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 234 వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. బ్యాంకాక్‌ నుంచి ఓ ప్రయాణికుడు తీసుకొచ్చాడని అధికారులు చెప్పారు. ఓ ప్రయాణికుడిపై అనుమానంతో రెండు ట్రాలీ బ్యాగుల్లో తనిఖీలు చేయగా.. చిన్న చిన్న ప్లాస్టిక్‌ బాక్సుల్లో వివిధ రకాలైన 234 వన్యప్రాణులను గుర్తించారు.

4 / 7
జర్నీలో ఓ కంగారూ పిల్ల చనిపోయింది.. ఇరుకైన ప్లాస్టిక్‌ బాక్సులో కొన్ని గంటలపాటు అలాగే ఉండిపోవడం వల్ల అది ప్రాణాలు కోల్పోయింది. మిగతా వాటి పరిస్థితిని కూడా గమనిస్తూ వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాటిని సంరక్షణలో ఉంచారు.

5 / 7
బెంగళూరు ఎయిర్ పోర్టులో గ్రీన్‌ ఛానెల్‌ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికుడు ప్రయత్నించడంతో అనుమానం వచ్చి అతన్ని ఆపినట్లు అధికారులు తెలిపారు.. అతని దగ్గరున్న ట్రాలీలు ఓపెన్‌ చేస్తే అందులో ఇవన్నీ కనిపించాయని.. కొండచిలువలు, ఊసరవెల్లులు, వివిధ రకాల పాములు, పిల్లులు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని అధికారులు వివరించారు.

6 / 7
అంతరించిపోతున్న జాతుల లిస్ట్‌లో ఉన్న వాటి సంరక్షణకు చట్టాలు కూడా కఠినంగానే ఉంటాయి. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు వీటిని ఎక్కడికి తరలిస్తున్నారు.. ఈ ముఠా వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

7 / 7
నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు.. విమానంలోకి వాటిని ఎలా అనుమతించారో గుర్తించే పనిలో ఉన్నారు. ఈ మేరకు బ్యాంకాక్ విమానాశ్రయ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఎవరో హస్తం ఉండి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.