AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 నిమిషాల్లో రుచికరమైన తాలింపు పెరుగు అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!

వేసవికాలంలో చల్లగా, తేలికగా, ఆరోగ్యకరంగా తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చే వంటకం పెరుగు అన్నం. సరైన తాలింపు, అల్లం, పచ్చిమిర్చి కలిస్తే ఈ సాధారణ వంటకం కూడా ఎంతో రుచిగా మారుతుంది. ముఖ్యంగా ఆవకాయ లేదా మామిడికాయ ఊరగాయతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది..

Srilakshmi C
|

Updated on: Jul 19, 2026 | 1:07 PM

Share
వేసవికాలంలో చల్లగా, తేలికగా, ఆరోగ్యకరంగా తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చే వంటకం పెరుగు అన్నం. సరైన తాలింపు, అల్లం, పచ్చిమిర్చి కలిస్తే ఈ సాధారణ వంటకం కూడా ఎంతో రుచిగా మారుతుంది. ముఖ్యంగా ఆవకాయ లేదా మామిడికాయ ఊరగాయతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. 5 నిమిషాల్లో చేసే తాలింపు పెరుగు అన్నం (Curd Rice) వంటకం తయారు చేయడం చాలా సులువు.

1 / 5
కావలసిన పదార్థాలు.. ఉడికించి చల్లార్చిన అన్నం – 2 కప్పులు, తాజా పెరుగు – 2 కప్పులు, ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి – 2 నుండి 3 (సన్నగా తరిగినవి), అల్లం – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది), ఉప్పు – తగినంత, కొత్తిమీర – కొద్దిగా, నూనె – 1 టేబుల్ స్పూన్, ఆవాలు – ½ టీ స్పూన్, జీలకర్ర – ½ టీ స్పూన్, మినప్పప్పు – 1 టీ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – 8 నుండి 10 ఆకులు, ఇంగువ – చిటికెడు తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఒక పెద్ద గిన్నెలో చల్లారిన అన్నం వేసి గరిటెతో లేదా చేత్తో మెత్తగా కలపాలి. ఇప్పుడు అందులో పెరుగు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆపై ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి కొన్ని సెకన్లు వేయించాలి. ఈ వేడి తాలింపును పెరుగు అన్నంపై పోసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి 2 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. అంతే రుచికరమైన తాలింపు పెరుగు అన్నం సిద్ధం.

3 / 5
రుచిని మరింత పెంచాలంటే.. పెరుగు పుల్లగా ఉంటే 2–3 టేబుల్ స్పూన్ల పాలు కలపండి. దానిమ్మ గింజలు లేదా ద్రాక్షపండ్లు కలిపితే ప్రత్యేక రుచి వస్తుంది. క్యారెట్ తురుము కలిపితే రంగు, పోషకాలు రెండూ పెరుగుతాయి. ఫ్రిజ్‌లో 15 నిమిషాలు ఉంచి చల్లగా వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది.

4 / 5
ఈ పెరుగు అన్నాన్ని ఆవకాయ, మాగాయ, నిమ్మకాయ ఊరగాయ లేదా పచ్చిమిరపకాయ వడియాలతో వడ్డిస్తే భోజనం మరింత రుచికరంగా ఉంటుంది. తక్కువ సమయంలో తయారయ్యే ఈ వంటకం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది.

5 / 5
Follow Us