
కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దాదాపు ప్రతి ఇంట్లో కాఫీ లేకుండా ఒక్క రోజు కూడా గడవదు. చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే చక్కెర, పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

కాఫీ తాగే ముందు లేదా ఆ తర్వాత కొన్ని రకాల ఆహారాలు తినకూడదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కాఫీలోని పదార్థాలు ఆహారాలలోని పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తాయి. మీరు కాఫీ ప్రియులైతే కొన్ని రకాల ఆహారాలను కాఫీతో కలిపి తినడం వెంటనే మానుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కాఫీతో ద్రాక్షపండు, నారింజ వంటి సిట్రస్ పండ్లను కలపవద్దు. అలా చేయడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా ఎర్ర మాంసం తింటే, పొరపాటున కాఫీ తాగకూడదు. దీనివల్ల మాంసం జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది. ఎర్ర మాంసం ఐరన్ శోషణలో కూడా సమస్యలు వస్తాయి.

అయితే బ్లాక్ కాఫీ తాగవచ్చు. కానీ పాలతో కాఫీ తాగకూడదు. పోషకాహార నిపుణులు చెప్పేది ఇదే.. ఎందుకంటే పాలతో కాఫీ తాగడం వల్ల పాలలో కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది.

స్నాక్స్, జంక్ ఫుడ్ లేదా వేయించిన ఆహారాలు తిన్న తర్వాత కాఫీ తాగడం మానుకోవాలి. ఇది రక్తప్రవాహంలో అసాధారణంగా కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ధాన్యాలు తిన్న తర్వాత కాఫీ తాగడం ఎప్పుడూ మంచిది కాదు. ఇది ధాన్యాలలోని విటమిన్లు, ఖనిజాలను సరిగ్గా గ్రహించకుండా నిరోధిస్తుంది.