
మహిళల ముఖంలో ప్రదాన ఆకర్షణగా నిలిచే వాటిల్లో పెదాలు కూడా ఒకటి. లిప్స్ విషయంలో కూడా మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. లిప్ స్టిక్ వేసి మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ చిట్కాలు ట్రై చేశారంటే లిప్ స్టిక్ అవసరం లేకుండానే పెదాలు అందంగా మెరుస్తాయి.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పెదాలపై ఎక్కువగా డెడ్ స్కిన్ సెల్స్ కూడా చేరుతూ ఉంటాయి. వీటిని కూడా తుడుస్తూ ఉండాలి. లేదంటే పిగ్మంటేషన్ పెరిగి మచ్చలుగా ఏర్పడతాయి.

ఓ టిష్యూ పేపర్ లేదా సాఫ్ట్‌గా ఉండే బ్రెష్ తీసుకుని.. పెదాలపై సున్నితంగా రుద్దండి. ఇలా చేయడం వల్ల పెదాలపై ఉండే మురికి పోతుంది. ఆ తర్వాత కొబ్బరి నూనె రాయండి. ఇలా చేయడం వల్ల పెదాల్లో రక్త ప్రసరణ బాగా జరిగి హైడ్రేట్‌గా మారతాయి.

తేనె కూడా తరచూ పెదాలకు అప్లై చేస్తూ ఉంటే.. మీ పెదాలు కూడా తేనెలా మెరుస్తూ అందంగా కనిపిస్తాయి. కలబంద గుజ్జులో కూడా తేనె కలిపి పెదాలపై రాసి.. ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సాఫ్ట్‌గా మారతాయి.

మీ పెదాలు రంగు మారకుండా హైడ్రేట్‌గా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే బీట్ రూస్ రసం లేదా క్యారెట్ రసం కూడా పెదాలపై రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.